విడదీయని బంధానికి 17 ఏండ్లు పూర్తి

  • స్టేట్ హోంలో సాదాసీదాగా వీణ, వాణి  బర్త్​డే

నర్సింహులపేట/దంతాలపల్లి, వెలుగు: మహబూబాబాద్ జిల్లాకు చెందిన అవిభక్త కవలలు వీణ, వాణి శుక్రవారంతో 17 ఏండ్లు పూర్తి చేసుకొని 18వ వసంతంలోకి అడుగు పెట్టారు. దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్16న ద్వితీయ సంతానంగా అవిభక్త కవలలు జన్మించారు. అప్పట్లో గుంటూరుకు చెందిన ప్రముఖ డాక్టర్​ చికిత్స అందించి 2006లో హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్​కు తరలించారు. దేశ, విదేశాల్లో స్పెషల్ డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది. తమకు  జీవోనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరగా పిల్లలను హైదరాబాద్ స్టేట్ హోమ్ కు తరలించారు. 2019లో టెన్త్  క్లాస్ పరీక్షలు  రాసి 9.3, 9.2 జీపీఏ సాధించారు. అప్పట్లో పలుసార్లు సీఎంను, మంత్రులను కలసినా ఆపరేషన్​ చేయించలేకపోయారు. శుక్రవారం 18 ఏండ్లు రావడంతో స్టేట్ హోంలో బర్త్ డే వేడుకలు సాదాసీదాగా జరిపారు. 18 ఏండ్లు రావడంతో వీరిని స్టేట్ హోమ్ లో ఉంచుతారా.. లేదా అనే సందిగ్ధం తల్లిదండ్రుల్లో నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Latest Updates