
టీమిండియా సెప్టెంబర్ 15 నుంచి ఇండియాలో దక్షిణాఫ్రికాతో తలపడే సిరీస్లో ఆఖరి రెండు టెస్టు మ్యాచ్ల వేదికలు మారాయి. అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరిగే రెండో టెస్టు రాంచీ వేదికగా, 19 నుంచి 23 వరకు జరిగే మూడో టెస్టుకు పుణె వేదికను మొదట నిర్ణయించారు. అయితే దసరా ఉత్సవాల రోజుల్లోనే రాంచీ మ్యాచ్ జరగడం కారణంగా భద్రతా కారణాల రీత్యా స్టేడియాన్ని మార్చాలని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ BCCIకి తెలిపింది. ఈ క్రమంలో పాలకుల కమిటీ అభ్యర్థనతో ICC తాజా నిర్ణయం తీసుకుంది. రాంచీలో జరగాల్సిన రెండో టెస్టును పుణెకి, పుణెలో జరగాల్సిన మూడో టెస్టును రాంచీకి మార్చారు. దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడనుంది. సెప్టెంబర్ 15న కోహ్లీసేన ధర్మశాలలో తొలి టీ20 ఆడనుండగా, అక్టోబర్ 2న విశాఖపట్నంలో తొలి టెస్టు ఆడనుంది. ఈ విషయాన్నిఐసీసీ ప్రకటించింది.