విజయ్ మాల్యా కేసు మరో మలుపు

డాక్యుమెంట్​ సుప్రీం కోర్టు లో గాయబ్

రిజిస్ట్రీపై సుప్రీం కోర్టు ఫైర్

తదుపరి విచారణ 20కి వాయిదా

న్యూఢిల్లీ: బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా కేసు మరో మలుపు తిరిగింది. ఇతడికి సంబంధించిన కోర్టు ధిక్కారం కేసు డాక్యుమెంటు సుప్రీం కోర్టులోనే మాయమైంది. తన సంతానానికి అక్రమంగా 40 మిలియన్ డాలర్లు ట్రాన్స్‌‌ఫర్ చేయడంతో గతంలోనే మాల్యాకు శిక్ష పడింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. జడ్జీలు యూయూ లలిత్, అశోక్ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం విచారణ మొదలుపెట్టారు. అయితే ఒక డాక్యుమెంటు కనిపించకపోవడంతో విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. మాల్యా రివ్యూ పిటి షన్ తమ బెంచ్‌‌ ముందుకు గత మూడేళ్లలో ఎందుకు రాలేదో చెప్పాలని కూడా కోర్టు రిజిస్ట్రీని జడ్జీలు ఆదేశించారు. ఈ ఫైలు వివరాలను చూసే ఆఫీసర్ల పేర్లు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫండ్స్ ట్రాన్స్‌‌ఫర్ కేసులో శిక్ష విధిం చడాన్ని సవాల్ చేస్తూ మాల్యా 2017లోనే పిటి షన్ వేశాడు. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా డియాగో కంపెనీ నుంచి తన సంతానానికి అక్రమంగా ఫండ్స్ ట్రాన్స్‌‌ఫర్ చేశాడని బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదు చేయడంతో సుప్రీం కోర్టు ఇతడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. బ్యాంకులకు రూ.9 వేల కోట్లకుపైగా లోన్లను ఎగ్గొట్టిన కేసు కోసం తనను ఇండియా పంపించవద్దం టూ మాల్యా బ్రిటన్​లో న్యా యపోరాటం చేస్తున్నాడు. ఇతని రిక్వెస్టును బ్రిటన్ సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది. మాల్యా 2016 నుంచి లండన్‌లో ఉంటున్నాడు. ఇతడు అతిత్వరలోనే ఇండియాకు రాకతప్పదని న్యాయనిపు ణులు అంటున్నారు.

 

Latest Updates