కూలిన తెలంగాణ అసెంబ్లీ పాత భవనం గోడ

the-wall-of-the-old-building-of-the-telangana-assembly-collapsed

తెలంగాణ అసెంబ్లీ పాత భవనం మినార్, డిజైన్ గోడ కూలింది. పాత టీడీఎల్పీ కార్యాలయంపై నుంచి శిథిలాలు ఊడిపడ్డాయి. కొంత కాలంగా శిథిలావస్థలో ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాదిన్నరగా మెయింటనెన్స్ ను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వానాకాలంలో స్లాబ్ నుంచి నీళ్లు కురిసినా అధికారులు పట్టించుకోలేదు. వారసత్వ బిల్డింగ్ అయినా ప్రభుత్వం కేర్ లెస్ గా ఉంది. ప్రస్తుతం పెచ్చులూడిన భవనంలోనే ప్రభుత్వ విప్ ల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్దశబ్దంతో ఇటుకలు, పెచ్చులు ఊడి పడటంతో అసెంబ్లీ సిబ్బంది పరుగులు పెట్టారు.

ప్రతి ఏడాది గోడలు, సీలింగ్ నుండి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజమన్నారు అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు. అసెంబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రతి ఏడాది మరమ్మతులు చేపడతుందన్నారు.  పాత శాసనసభ భవనానికి ఎప్పిటికప్పుడు  అవసరమైన మేరకు మరమ్మతులు చేపడుతున్నామన్నారు.

తాగిన మత్తులో ఎస్ఐని ఢీ కొట్టిన యువకుడు

అమ్మకు ఏం ఇష్టమో తెలుసా?.. ముంబై పోలీసుల ట్వీట్

కేసీఆర్ దోపిడి.. మందుకు, స్టఫ్ కు కూడా సింగరేణి పైసలే

Latest Updates