సీనియర్స్‌కు గౌరవప్రద వీడ్కోలు ఇవ్వాల్సిందే

మాజీ లెఫ్టాండర్ యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ: దేశ క్రికెట్‌కు ఏళ్లుగా సేవలు అందించిన సీనియర్‌‌ క్రికెటర్స్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. తాను మంచి వీడ్కోలును అందుకోలేకపోయానని, దాని గురించి విచారించట్లేదన్నాడు. కానీ చాన్నాళ్లుగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ క్రికెటర్స్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐని మాజీ లెఫ్టాండర్ కోరాడు. గతేడాది జూన్ 10న యువీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. 17 ఏళ్ల పాటు మెన్‌ ఇన్ బ్లూకు యువీ ఎన్నో మధురమైన గెలుపులు అందించాడు. వన్డేల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా యువీని చెప్పొచ్చు.

‘నా కెరీర్‌‌ చివర్లో వారు (బోర్డు) ప్రవర్తించిన తీరు అన్‌ప్రొఫెషన్‌గా అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూస్తే.. హర్భజన్, సెహ్వాగ్, జహీర్ ఖాన్‌ను కూడా అలాగే జరిగింది. ఇది ఇండియన్ క్రికెట్‌లో ఓ భాగమే. నేను గతంలో కూడా ఇలాంటివి చూశా. అందుకే నేను ఆశ్చర్యపోలేదు. కానీ భవిష్యత్‌లో ఏ ప్లేయర్‌‌ అయినా ఇండియాకు సుదీర్ఘ కాలం ఆడి కఠిన పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు సరైన గౌరవం అందాలి. వాళ్లను గౌరవించండి. గంభీర్ లాంటి కొందరు మనకు రెండు వరల్డ్‌ కప్‌లు అందించారు. సెహ్వాగ్ లాంటి బ్యాట్స్‌మన్‌ సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో చాలా పెద్ద మ్యాచ్ విన్నర్. వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ కూడా’ అని యువీ చెప్పాడు.

Latest Updates