‘ఎయిర్ ఇండియా’ మొత్తాన్నే కొనేయొచ్చు

ఎన్ఆర్ఐలు 100 శాతం వాటా దక్కించుకోవచ్చు

నోటిఫికేషన్ జారీ చేసిన డీఈఏ

న్యూఢిల్లీ: అప్పుల కుప్పగా మారిన ఎయిరిండియాలో వందశాతం వాటాలను కొనేందుకు నాన్–రెసిడెంట్ ఇండియన్లు (ఎన్ఆర్ఐలు)కు అనుమతులు ఇస్తున్నట్టు డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ (డీఈఏ) ప్రకటించింది. ఇందుకోసం ఫారిన్ డైరె క్ట్ ఇన్వెస్ట్‌‌మెం ట్స్ రూల్స్‌‌ను మార్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇతర షెడ్యూల్డ్ ఎయిర్‌‌‌‌లై న్ ఆపరేటర్ల మాదిరే ఎన్ఆర్ఐలూ 100 శాతం వాటా కొనొచ్చని పేర్కొంది. ప్రస్తుత రూల్స్ ప్రకారం ఎయిరిండియాలో ఫారిన్ డైరె క్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్లు 49 శాతాన్ని మించకూడదు. ప్రత్యక్షం గాగానీ, పరోక్షంగా గానీ ఈ వాటాను పెం చకూడదు. ఈ కంపెనీని కొనేందుకు బిడ్స్ వేయడానికి వచ్చే నెల 31 వరకు గడువు ఉంది. ఎయిర్ ఇండియాను అమ్మేందుకు 2 018 లోనూ ప్రయత్నాలు జరిగినా, ఎవరూ బిడ్ వేయలేదు.

ఎయిరిండియాలో వందశాతం, ఎయిరిండియా సాట్స్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ సర్వీసెస్‌‌లో 50 శాతం వాటా అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించింది. ఎయిరిండియాకు గత నవంబర్ నాటికి 121 ఎయిర్ క్రాఫ్స్‌ట్ ఉండగా ఇందులో 65 సొంత విమానాలు. ఎయిరిం డియా, ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌లు కలిపి ప్రస్తుతం 146 విమానాలను రన్ చేస్తున్నాయి. ఈ కంపెనీలో 18 వేల మంది పనిచేస్తున్నారు. కంపెనీ నష్టాలు రూ.60 వేల కోట్లకుపైగా ఉన్నాయి.

 

Latest Updates