ఆస్తి వివాదం.. భార్య, మామ పై హత్యాయత్నం!

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది.  కట్టుకున్న భార్యను, మామను కారుతో ఢీ కొట్టి చంపబోయాడు. అయితే గాయాలతో వాళ్లిద్దరు బయటపడ్డారు. ఈ ఘటన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలోని నేషనల్ హైవే పక్కన జరిగింది. జరుగుమిల్లి మండలం బిట్రగుంటలో శివాజీ, లత అనే దంపతులున్నారు. కొన్ని రోజులుగా వీరి మద్య గొడవలు జరుగుతుండటంతో విడివిడిగా ఉంటున్నారు. వీళ్ల మధ్య ఆస్తి తగాదా కూడా ఉంది. కొన్ని రోజులుగా ఆస్తి వివాదం గురించి సెటిల్ మెంట్లు జరుగుతున్నాయి. అయితే ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలనే ఉద్దేశంతో లత, ఆమె బాబాయ్ ను కారుతో ఢీ కొట్టి చంపబోయాడు శివాజీ.

Latest Updates