మరిదికి గాయాలు : భర్త కొట్టిండని నిప్పంటించుకుంది

షాద్ నగర్, వెలుగు: అనుమానంతో భర్త కొట్టాడని భార్య పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మేళ్లబాయి తండాలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండావాసి నేనావత్ గోపాల్, సునీతకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది . వీరికి ఇద్దరు పిల్లలు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సునీత ఫోన్ లో మాట్లాడుతోంది. ఆ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావంటూ గోపాల్ ఆమెను కొట్టాడు.

అవమానం భరించలేక సునీత ఇంటి ముందు ఉన్న బైక్ లోని పెట్రోల్ తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరిది సంతోష్ కు మంటలంటుకున్నాయి. తీవ్రగాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సునీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు షాద్ నగర్ పోలీసులు తెలిపారు. అయితే వదినను కాపాడే ప్రయత్నంలో మరిది సంతోష్ తీవ్రగాయాలైనట్లు తెలిపారు డాక్టర్లు.

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates