డ్యూటీకొస్తమన్న కార్మికులు.. వద్దన్న డిపో మేనేజర్‌

మేడిపల్లి/మహేశ్వరం, వెలుగు: డ్యూటీలో చేరతామంటూ ఉప్పల్​బస్​డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. గురువారం విధుల్లో చేరేందుకు దాదాపు 300 మంది కార్మికులు ఉప్పల్​డిపోకు వచ్చారు. బేషరతుగా తాము డ్యూటీలో చేరే అవకాశం కల్పించాలని డిపో మేనేజర్​వెంకారెడ్డిని కోరారు. అందుకు నిరాకరించిన డీఎం.. యాజమాన్యం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున డిపోలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

దీంతో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు ధర్నా చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఆర్టీసీ డిపో వద్దకు కూడా గురువారం కొంతమంది కార్మికులు చేరుకుని తమను డ్యూటీలో చేర్చుకోవాలని కోరారు. పై నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ప్రస్తుతం ఎవరినీ విధుల్లోకి చేర్చుకోలేమని డీఎం రవీందర్​తెలిపారు. దీంతో నిరాశతో కార్మికులు వెనుదిరిగారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates