వరల్డ్ రికార్డ్ : గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 189,077మందికి సోకిన కరోనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 189,077 కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.  ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటలలో కేసులు  రికార్డు స్థాయిలో 189,077  కొత్త కేసులు నమోదైనట్లు తాము గుర్తించామని తెలిపింది. రికార్డ్ స్థాయిలో నమోదైన దేశాల్లో  బ్రెజిల్ మరియు అమెరికాలు ముందు వరసలో ఉన్నాయని ఈ రెండు దేశాల్లో గడిచిన 24గంటల్లో 46,860 మరియు 44,458 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పింది. ఇక భారత్ లో 19,906 మందికి వైరస్ సోకింది.  ఇక ఒక్క రోజులో 4612 మంది కరోనా తో మరణించగా.. ఇది శనివారం మరణించిన వారి సంఖ్య కంటే 2254 తక్కువ అని డబ్ల్యూహెచ్‌ఓ   ప్రకటించింది. కాగా కొద్దిరోజుల క్రితం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 10మిలియన్లు దాటుతాయని నివేదించింది.

Latest Updates