ప్రజాస్వామం పట్ల వైసీపీకి గౌరవం లేదు

2014 లో టీడీపీ ఎన్నికలను దాటవేసిందని.. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగ వ్యవహరిస్తోందని తెలిపారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రజాస్వామం పట్ల వైసీపీకి గౌరవం లేదని యువత నామినేషన్ లు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలు మాదిరిగా పనిచేస్తున్నారన్న పవన్.. నామినేషన్ లు వేసిన వారు ధైర్యంగా పోటీ చేయండన్నారు.

బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజల్ని, అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎన్నికల కమీషన్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్, కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలో హింస వాతావరణం కొనసాగుతొందన్న ఆయన.. రాష్ట్రంలో రౌడి రాజ్యంను సహించమన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కలిసి వారిలో ధైర్యం నింపేందుకు ప్రచారంలో పాల్గొంటామన్నారు పవన్.

See Also: మండలిలో క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ అజయ్

కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

సినీ దంపతులకు కరోనా వైరస్

ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదు

Latest Updates