వెంచర్ లో కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి

జనగాం జిల్లా: కరెంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం జనగాం జిల్లాలో జరిగింది. జిల్లాలోని నిలిగొండ గ్రామంలోని ఓ వెంచర్ లో పని చేస్తున్న పెరుమాండ్ల ప్రభాస్(17) కు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో స్పాట్ లోనే చనిపోయాడని తెలిపారు స్థానికులు. వెంచర్ లో కర్రలతో జెండాలు నాటుతుండగా కర్ర పైకి లేపడంతో ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగలి చనిపోయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం జనగాం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

మృతుడిది యాదాద్రి భువనగిరి జిల్లా, రామాజిపేట గ్రామం. ఇంటర్ కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఈ మధ్యనే సొంత ఊరు రామాజీపేటలోని ఓ వెంచర్ లో పని చేస్తున్నాడు. ప్రభాస్ పని చేసే ఓనర్ కు జనగాంలోనూ ఓ వెంచర్ ఉండటంతో.. బుధవారం రామాజీపేట వెంచర్ లో పని అయిపోయాక.. ప్రభాస్ జనగాం వెంచర్ లో పని చేస్తుండగా .. ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అసలే వర్షాకాలం కావడంతో భూమి, కర్రలు తడిగా ఉండటంతో కరెంట్ షాక్ ప్రభావం ఎక్కువగా ఉండటంతోనే ప్రభాస్ స్పాట్ లోనే చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్ధికంగా వెనకబడ్డ ప్రభాస్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నారు మృతుడి బంధువులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates