మేడారం జాతరలో ప్లాస్టిక్​ వాడొద్దంటూ యువకుడి పాదయాత్ర

  • వరంగల్​ నుంచి 110 కి.మీ.యువకుడి పాదయాత్ర

ములుగు, వెలుగు: మేడారం మహా జాతరను పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని సామాజిక కార్యకర్త, మేదిని సాంఘిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు కొలిపాక ప్రకాశ్ అన్నారు. కాలుష్య నివారణ, ప్లాస్టిక్ రహితం, ప్రకృతికి ఎలాంటి నష్టం కలగకుండా జాతర జరుపుకోవాలనే లక్ష్యంతో  గురువారం సాయంత్రం వరంగల్ నుంచి మేడారానికి 110 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం ములుగుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు కోటి మందికి పైగా వచ్చే అవకాశం ఉందని, భక్తులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వేయాలని, డస్ట్ బిన్ లను ఉపయోగించుకోవాలని కోరారు.

Latest Updates