రెడ్ సిగ్నల్ పడినా ఆగలే.. కారును ఢీకొట్టి యువకుడి మృతి

రెడ్ సిగ్నల్ పడినా ఆగలే..

ఓవర్ స్పీడ్​తో వెళ్లి కారును ఢీకొట్టిన యువకుడి మృతి

శంషాబాద్, వెలుగు: ఓవర్ స్పీడ్ తో బైక్ డ్రైవ్ చేసి కారును ఢీకొట్టిన యువకుడు చనిపోయిన ఘటన మంగళవారం మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. లక్ష్మిగూడ గ్రామంలో ఉండే కట్రావత్ ఈశ్వర్(25) కాటేదాన్ లో టీ స్టాల్ నడుపుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు  ఈశ్వర్ తన బైక్ పై కాటేదాన్ కు బయలుదేరాడు. దుర్గానగర్ ఎక్స్ రోడ్ వద్ద రెడ్ సిగ్నల్ పడినా ఈశ్వర్ ఆగకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్లి ముందున్న కారును బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ఈశ్వర్ కు తీవ్రగాయాలయ్యాయి.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఈశ్వర్ మృతి చెందాడు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు ఫైల్ చేసి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. ఓవర్ స్పీడ్, నెగ్లిజెన్స్   కారణంగానే ప్రమాదం జరిగిందని సీఐ నర్సింహ తెలిపారు. టూవీలర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

రోడ్డు దాటుతుండగా…

ఎల్ బీ నగర్: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఇద్దరు కూలీలు చనిపోయిన ఘటన హయత్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. హయత్ నగర్ పరిధి సీతారాంపురంలో ఉంటున్న పెంటల సుదర్శన్(70), రంగనాయకుల గుట్టకి చెందిన అన్మగల్ భిక్షపతి(55) కూలి పనిచేసేవారు. మంగళవారం మధ్యాహ్నం హయత్ నగర్ లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద విజయవాడ నేషనల్ హైవేపై వీరిద్దరూ రోడ్డు దాటుతుండగా ఎల్ బీ నగర్ నుంచి పెద్ద​అంబర్ పేట్ వైపు వస్తోన్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సుదర్శన్,భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించామన్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయినా ఇప్పటిదాకా అధికారులు పనులు చేపట్టలేదని స్థానికులు చెప్తున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి

వికారాబాద్: జిల్లాలోని వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. మర్పల్లి మండలం వీర్లపల్లికి చెందిన సంగమేశ్​ గౌడ్(34) మంగళవారం మోమిన్ పేట మీదుగా బైక్ పై సదాశివపేట వెళ్తున్నాడు. బూరుగుపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన బస్సు అతడి బైక్ ను ఢీకొట్టడంతో అక్కడిక్కడే చనిపోయాడు.  మోమిన్ పేట పోలీసులు కేసు ఫైల్ చేశారు. సంగమేశ్ కి రెండేళ్ల క్రితమే పెళ్లి కాగా..అతడికి ఆరు నెలల కూతురు ఉంది.

తాండూరు పట్టణానికి చెందిన మహ్మద్ షేక్ హఫీజ్(50) మెకానిక్ పనిచేసేవాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు బైక్ పై అంతారం నుంచి తాండూరు వెళ్తున్నాడు. ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అతడి బైక్ లారీ కిందకు దూసుకుపోయింది. ప్రమాదంలో హఫీజ్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని హాస్పిటల్ కి తరలించగా..అప్పటికే హఫీజ్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాండూరు పోలీసులు చెప్పారు.

For More News..

ఫోన్‌లో మాట్లాడొద్దన్నందుకు యువతి సూసైడ్

Latest Updates