పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వేరే అమ్మాయితో..

 పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు తనను మోసం చేశాడని యువతి ఎల్ బీనగర్ పీఎస్ లో కంప్లయింట్ చేసింది. పోలీసులు అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నల్గొండ చెందిన ఓ యువతి సిటీలోని ఓ హాస్పిటల్ లో నర్సు ట్రైనింగ్ తీసుకుంటోంది. అదే ఆస్పత్రిలో అనస్థీషియా టెక్నీషియన్ గా పనిచేస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన కొర్రే గోవింద్ నాయక్(23)తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. గోవింద్ ఆమె నంబర్ తీసుకుని ప్రేమిస్తున్నానని..పెళ్లిచేసుకుంటానని చెప్పేవాడు. తన ఇంట్లో వాళ్లతో మాట్లాడమని ఆ యువతి చెప్పడంతో గతేడాది నవంబర్ 23న గోవింద్ తన పేరెంట్స్ ను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు.  యువతి తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత గోవింద్ వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు యువతికి తెలియడంతో ఆమె అతడిని ప్రశ్నించింది. అప్పటి నుంచి గోవింద్ ఆమె ఫోన్ నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు.  దీంతో ఆ యువతి మంగళవారం తన కుటుంబసభ్యులతో కలిసి గోవింద్ పై ఎల్ బీనగర్ పీఎస్ లో కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Latest Updates