అన్న మ‌ర‌ణం త‌ట్టుకోలేక త‌మ్ముడు మృతి

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ములు గంటల వ్యవధిలోనే గుండెపోటుకు గురై మృతి చెందారు. వీరిలో ఒకరు హైదరాబాద్ జీహెచ్ ఎంసీ లో స్విమ్మింగ్ కోచ్ కావడంతో ఆ కుటుంబం లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి దళితవాడలో చోటుచేసుకుంది.

శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి బస్తీ లో నివసించే రాచమల్ల సుదర్శన్ (55) జీహెచ్ ఎంసీ లో స్విమ్మింగ్ కోచ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో సుదర్శన్ మృతి చెందాడు. ఈ మేరకు మంగళవారం నాడు సుదర్శన్ అంత్యక్రియలకు హాజరైన అతని సోదరుడు లవన్ అన్న మృతిని తట్టుకోలేక అతను కూడా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన స్విమ్మింగ్ కోచ్ సుదర్శన్ కుటుంబం లో తీవ్ర విషాదాన్ని నింపింది.

 

 

Latest Updates