రీ ఓపెన్ అయిన థియేటర్స్.. క్యూ కడుతున్న సినీలవర్స్

మల్టీప్లెక్స్ లో వీకెండ్ చిల్

సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం 50 శాతం ఆక్యుపెన్సీతో షో లు

రీ ఓపెన్ అయిన థియేటర్స్
హ్యాపీగా ఫీలవుతున్న మూవీ లవర్స్
ఫస్ట్ డే నుంచే గుడ్ రెస్పాన్స్

‘వీకెండ్ వచ్చిందంటే పక్కా సినిమాకి వెళ్లాల్సిందే.  లాక్ డౌన్ తో మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో మూవీ చూడటాన్ని మిస్ అయ్యా.  ఓటీటీలో కన్నా థియేటర్ లో చూస్తేనే ఫీల్ ఉంటుంది. 8 నెలల తర్వాత మళ్లీ ఫ్రెండ్స్ తో కలిసి మల్టీప్లెక్స్​కు వచ్చా. సేఫ్టీ ప్రికాషన్స్ బాగున్నాయి.’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు బంజారాహిల్స్ కి చెందిన మూవీ లవర్ సిద్ధార్థ్.

హైదరాబాద్, వెలుగు: సిటిజన్లలో చాలామందికి మూవీనే బెస్ట్ స్ట్రెస్ రిలీవర్. వీక్ అంతా ఫుల్ వర్క్ తో బిజిబిజీగా గడిపేసినా వీకెండ్ లో మాత్రం మూవీస్ చూస్తూ చిల్ అవుతుంటారు.  కరోనా కారణంగా మార్చి నుంచి సిల్వర్ స్క్రీన్ కి మూవీ లవర్స్ దూరమైపోయారు. దసరా, దీపావళి కి ఓపెన్ అవుతాయని అనుకున్నా కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. సెంట్రల్ గైడ్ లైన్స్ తో, కోవిడ్ కి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటూ సిటీలో శుక్రవారం మల్టీప్లెక్స్ లు, కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీ రూల్  ఉన్నప్పటికీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని మల్టీప్లెక్స్ ఓనర్లు తెలిపారు. శనివారం వీకెండ్ కావడంతో ఉదయం నుంచే ఫుట్ ఫాల్ స్టాట్ అయిందన్నారు. డైరెక్ట్ బాక్స్ ఆఫీస్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ముందే టికెట్స్ బుక్ చేసుకుని వస్తున్నారని బంజారాహిల్స్ జీవీకే ఐనాక్స్ మేనేజర్ తెలిపారు. శుక్రవారం 50 శాతం ఆక్యుపెన్సీతో 90 శాతం సీట్లు ఫుల్ అయ్యాయని..శనివారం75–80 శాతం ఆడియెన్స్ వచ్చారని కొత్తగూడలోని ఏఎంబీ సినిమాస్ మేనేజ్ మెంట్ తెలిపింది.

ఓటీటీ నుంచి  థియేటర్ కి..

కోవిడ్ కారణంగా చాలా మూవీస్ ఓటీటీల్లో రిలీజయ్యాయి. వీటిల్లో మంచి రేటింగ్ వచ్చిన మూవీస్ ను మళ్లీ థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రిలీజ్ కి సిద్ధంగా ఏ సినిమా లేకపోవడంతో హిందీ, ఇంగ్లీషుల్లో ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ ని స్క్రీన్ చేస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘ టెనెట్’ ను  చూసేందుకు ఎక్కువగా ఆడియన్స్ వస్తున్నారని మల్టీప్లెక్స్ ల మేనేజర్లు చెప్తున్నారు. ప్రతి థియేటర్లో థర్మల్ చెకప్ తో పాటు శానిటైజేషన్ కంపల్సరీ ఉండేలా కేర్ తీసుకుంటున్నామంటున్నారు.  కోవిడ్ రూల్స్ కి అనుగుణంగా థియేటర్ లోపల సీటు కి సీటుకి మధ్య గ్యాప్ ఇస్తున్నామన్నారు. సిటీలోని ప్రసాద్స్ ఐమాక్స్, బంజారాహిల్స్ లోని జీవీకే ఐనాక్స్, కొత్తగూడ శరత్ సిటీక్యాపిటల్ మాల్ లోని ఏఎంబీ, ఉప్పల్, అత్తాపూర్, కొంపల్లిలోని ఏషియన్ సినిమాస్ లలో ఆడియన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ లలో 4 లాంగ్వేజ్ ల మూవీస్ స్క్రీన్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ సిటీలో 200కు పైగా ఉండగా లాక్ డౌన్ కారణంగా లాస్ లో నడుస్తున్నాయి. దీంతో ఇందులో చాలావరకు ఓపెన్ కాకపోగా, మిగిలిన వాటిలో కొన్ని రెంట్లకు, లీజ్ కి వెళ్లిపోతున్నాయి. ఓపెన్ అయిన థియేటర్లు కూడా కొంతమంది ఆడియన్స్ తో నడుస్తున్నాయి.

రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నం

సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క రూల్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నం. ఆడిటోరియంలో 50శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా చూస్తున్నాం. సీట్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. బాక్స్ ఆఫీస్, ఫుడ్ కౌంటర్స్ దగ్గర ఫ్లోర్ మార్కర్స్ ఏర్పాటు చేశాం. డైరెక్ట్ క్యాష్ కాకుండా డిజిటల్ వే లో
ట్రాన్సాక్షన్స్ అయ్యేలా చూస్తున్నాం. పీపీఈ కిట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఎంట్రన్స్ లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ కంపల్సరీ గా ఉంటుంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే క్యూఆర్ బేస్డ్ ఎంట్రెన్స్ ఏర్పాటుచేశాం. ఆడియన్స్ మెల్లమెల్లగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నరు.

– జీవీకే ఐనాక్స్ మేనేజర్, బంజారాహిల్స్

ఆన్‌లైన్‌‌లో టికెట్ బుక్ చేసుకుంటున్రు

దాదాపు 8 నెలల తర్వాత మళ్లీ బిజినెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అనుకున్నదాని కన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ఆన్ లైన్ లో కూడా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. కోవిడ్ రూల్స్ అన్ని పక్కాగా పాటిస్తున్నాం. వీకెండ్ కావడంతో  రష్ బాగుంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం.

– విశ్వనాథ్ రెడ్డి, మేనేజర్, ఏషియన్ మూవీస్

థియేటర్ అయితేనే బెటర్

నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం.  థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయని తెలిసి ప్రసాద్స్ ఐమాక్స్ లో మూవీ చూడటానికి ఫ్రెండ్స్ తో పాటు వచ్చా. చాలా రోజుల తర్వాత  స్క్రీన్ పై మూవీ చూడటాన్ని  బాగా ఎంజాయ్ చేశా.

‑ కుశాల్,వార్సిగూడ

For More News..

టీ20 సిరీస్‌పై ఇండియా కన్ను.. ఆసీస్‌తో నేడు రెండో వన్డే

Latest Updates