దేవాల‌యంలో చోరీ.. సీసీ కెమెరాకు చిక్కిన దొంగ‌లు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్ గౌరెల్లి గ్రామంలో మంత్రాల ఎల్లమ్మ దేవాలయం లో చోరీ జ‌రిగింది. ఇద్దరు వ్యక్తులు హుండీ ని పగులగొట్టి అందులో ఉన్న డబ్బులను దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. వేలం పాట దారుడు మోతిలాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు గుడిని ప‌రిశీలించారు. అక్క‌డ అమ‌ర్చిన సీసీ కెమెరాలో చోరికి పాల్ప‌డ్డ దృశ్యాలు న‌మోద‌య్యాయి . పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు .దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు మర్రిగూడ మండలం ఏరు గండ్లపల్లి గ్రామస్థులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు . గుడి ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారాపోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Latest Updates