హనుమంతుడి గుళ్లో చోరీ.. 8 నెలల్లో ఇది నాల్గవ సారి

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న కొత్తూరు తాడేపల్లి రహాదారిపై ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. గత 8 నెలల కాలంలో ఇది 4వ సారి. దొంగలు కానుకల హుండీ పగలగొట్టి 15 వేల రూపాయలు దోచుకెళ్ళారు.

ఈ చోరీ ఘటనపై ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి సీఐ అంకమ్మరావుకు హుండీ పగలగొట్టి సొమ్ము కాజేశారని తెలుపగా.. ఆలయంలో పూజలు నిర్వహించే పూజారి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ, ఏవరో ఒకరు ఆలయానికి రక్షణ కోసం 24 గంటల పాటు ఉండాలని సూచించారు.

దీంతో ఆగ్రహానికి గురైన పూజారి.. పోలీసులు వారి నిఘా వైఫల్యం కప్పి పుచ్చుకునేందుకు ఇలా అనటం సమంజసం కాదని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధ్యత రహితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పలువురు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates