శివాలయంలో దొంగతనం: మూడుకిలోల వెండి చోరి

కృష్ణా జిల్లా పెద్దవరం మండలం లోని శ్రీ పార్వతీ సమేత నీలకంఠ స్వామి గుడిలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో మూడు కిలోల వెండి ఆభరణాలు, 25 గ్రాముల బంగారం చోరీ జరిగినట్టుగా గుడి పూజారులు పోలీసులకు తెలిపారు. అర్చకుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. గుడి తాళాలు పగులకొట్టి, స్వామి వారి వెండి కిరీటం. అమ్మవారి బంగారు మంగళసూత్రం చోరీకి గురయ్యాయని తెలిపారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates