ప్రేమికుడి అవసరాల కోసం అక్క ఇంటికే కన్నం

ప్రేమికుడి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఓ చెల్లెలు… సొంత అక్క ఇంటికే కన్నమేసి పట్టుబడింది. హైదరాబాద్ రామాంతపూర్ కు చెందిన 20 ఏళ్ల ఝాన్సీ.. బంజారాహిల్స్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాహుల్ (21) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్ కు కొంత డబ్బు కావాల్సి ఉండగా…అదే విషయాన్ని ఝాన్సీకి విషయం చెప్పాడు.

ఎలాగైనక తన ప్రేమికుడికి సహాపడాలనే తపనతో ఫీర్జాదిగూడ బుద్ధానగర్‌ లో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లింది ఝాన్సీ.  అక్క ఇంట్లో లేని సమయంలో బంగారు నగలు దొంగిలించి…వాటిని రాహుల్ కు ఇచ్చింది. నిఖిల్ అనే తన స్నేహితుడితో కలిసి వాటిని అమ్మేశాడు రాహుల్. ఇంట్లోని బంగారం పోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఝన్సీపై అనుమానం వచ్చింది. విచారించడంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. రాహుల్‌, నిఖిల్‌, ఝాన్సీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగు తులాల బంగారు నగలను రికవరీ చేశినట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates