12 తులాల బంగారు నగలు చోరీ

నారాయణఖేడ్, వెలుగు: తాళం వేసిన ఉన్న ఓ ఇంట్లోదొంగలు ప్రవేశించి 12 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. నారాయణఖేడ్ ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం. నాగలిగిద్ద మండలం ఇరాక్‌పల్లికి చెందిన మారుతీరెడ్డి నారాయణఖేడ్‌లో బ్యాటరీల షాప్ నడిపిస్తూ స్థానిక రెహమాన్ కాలనీలోని శ్రీధర్ పాటిల్ ఇంట్లోరెంట్‌కు ఉంటున్నాడు. గత నెల 21న మారుతీరెడ్డి తన భార్య డెలివరీ కోసం హైదరాబాద్ కుటుంబ సభ్యులతో వెళ్లారు.

అనంతరం జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం మారుతీరెడ్డి ఉన్న గది తలుపులు తెరిచి ఉండడంతో ఇంటి యజమాని సమాచారం ఇవ్వగా వచ్చి చూసే సరికి ఇంట్లో ఉన్న 12 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates