వినాయక మండపాల దగ్గర చోరీలు.. సీసీ కెమెరాకి చిక్కిన ఆకతాయిలు

thefts-at-ganesh-pandals-in-hyderabad

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వినాయక మండపాల వద్ద ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. అర్ధరాత్రిళ్ళు నిర్మానుష్యంగా ఉన్న చిన్న చిన్న కాలనీలు, ఎవరూ నిద్రించని మంటపాల వద్ద దొంగతనాలకు తెగబడుతున్నారు.. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు మల్లికార్జునా నగర్, నాగార్జున నగర్ కాలనీలోని వినాయకుని మంటపం వద్ద రెండూ లడ్డూలతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల్లో లడ్డూలు దొంగలు చిక్కారు.. ముందుగా దర్జాగా మంటపం వద్దకు నడుచుకుంటూ వెళ్ళిన నలుగురు, లడ్డూలను, హుండీని దొంగిలించిన తరువాత సీసీ కెమరాలను చూశారు.. వెంటనే వాటిని తీసుకొని కాళ్ళకు పనిచెప్పారు.

Latest Updates