నీళ్లు లేని ఊరు..చుట్టాలే రారు

ఫిబ్రవరి ప్రారంభంలో ఆ ఊళ్లో  బావులు, కుంటలు, వాగులు ఎండిపోతాయి. ఎత్తైన ప్రాంతంలో ఉండే ఆ గ్రామస్థులు తిరిగి వానలు పడేవరకు దాదాపు ఐదు నెలలపాటు నరక యాతన అనుభవిస్తారు. ఎడ్లబండ్లకు డ్రమ్ములు కట్టి పక్క ఊరి నుంచి నీటిని తెచ్చుకుంటారు. ఆ గ్రామంలో నీటి కష్టాలుచూసి వారి చుట్టాలు ఎండాకాలంలో ఆ ఊళ్లో కి అడుగు పెట్టడం లేదు. ఆ ఊళ్లో శుభకార్యా లకు కూడా వేసవికాలం సెలవుంటుం ది. పుష్కర కాలంగా కేశవపట్నం గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్య ఇదీ…ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రానికి 13 కి.మీ. దూరంలో గుట్ట ప్రాంతంలో కేశవపట్నం ఉంటుం ది. ఈ గ్రామానికి వెళ్లడానికి సరైన రవాణా

వసతి లేదు. కేవలం వర్షా కాలంలోనే ఈ గ్రామంలో నీటి నిల్వలుం టాయి. నవంబరు మాసం నుంచే బావులు, చెరువులు, కుంటలు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. ఊళ్లో ఉన్న చేతిపంపులు కూడా పనిచేయవు. మొత్తం 800 కుటుం బాలు, 1,880 మంది ఓ టర్లు ఈ గ్రామంలో ఉన్నారు. కొండ ప్రాంతం కావడంతో నీరంతా లోతట్టు ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఎత్తైన ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు కొద్ దిగా అడుగంటినా చేతిపంపులు పని చేయవు. చెరువులు, కుంటల్లో నూ నీరు త్వరగా ఇంకిపోతుంది. ఈ సమస్య కొత్తదేమీ కాదు. ప్రతి సంవత్సరం ఈ సమస్యతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. చాలాసార్లు అధికారులకు సమస్యను విన్నవిం చినా ఫలితం దక్కలేదు. ఊళ్లో మిషన్ భగీరథ కింద ఓ ట్యాంకు నిర్మిం చినప్పటికీ, దానికి లీకేజీసమస్య ఉండడంతో సమస్య పరిష్కారం కావడంలేదు. రాత్రిపూట ట్యాంకు లో నీరు నిం పుతున్నారు.నింపిన కొద్ది సమయంలోనే నీరంతా లీకై ట్యాం క్ చుట్టుపక్కలంతా బురదమయమవుతోంది.

వాళ్ల ఇళ్లకు ఎవరూ రారు

ఫిబ్రవరి నెల వచ్చిం దంటే చాలు కేశవపట్నం గ్రామస్థుల ఇంటికి చుట్టాల రాక బందవుతుంది. నీరుదొరక్క సతమతమయ్యే ఆ గ్రామస్థుల ఇంటికి వచ్చివారికి అదనపు భారం కావడం ఇష్టం లేక చుట్టాలెవరు రావడం లేదు. శుభకార్యాలు కూడా ఎక్కువగా వానాకాలం, చలికాలంలోనే చేసుకుంటారు.ఎందుకంటే చేతినిం డా నీళ్లున్నప్పుడైతే ఎలాంటిసమస్య ఉండదని. ఎండాకాలంలో సమస్య మరీ తీవ్రమయితే గ్రామం మొత్తం ఖాళీ అవుతుంది.అందరూ ఇతర గ్రామాల్లో ని చుట్టాలిం డ్లకు వెళ్లిపోతారు. ఇలా చాలాసార్లు ఈ ఊరు ఖాళీ అయింది.పక్కనున్న నర్సాపూర్ లో కరెంటు సమస్య వచ్చినప్పుడల్లా సగం మంది గ్రామస్థులు ఇతర ఊళ్లకు వెళ్లిపోతారు. కొందరైతే ఎండాకాలానికి ముందేలోతట్టు ప్రాంతాల్లో ఉండే చుట్టాలింటి కి వెళ్లి మళ్లీ వర్షా లు పడ్డాక వస్తారు.

Latest Updates