పర్మిషన్ లేకున్నా.. డాటాను చోరీ చేస్తున్న యాప్స్

there-are-1325-android-apps-that-steal-your-data-even-after-you-say-no-fix-incoming-with-android-q

స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత మన పర్సనల్ డేటాను పలు సోషల్ మీడియా యాప్స్ లో షేర్ చేస్తున్నాం. అయితే మన మొబైల్ కి సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఓఎస్ కు సంబంధించిన   పలు యాప్స్‌  మన అనుమతులు లేకుండానే మన  ఫోన్లోని డేటాను తస్కరిస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. రూల్స్ ను బ్రేక్ చేసి మరీ ఆ యాప్స్ మన డాటాను దొంగలిస్తున్నాయని ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇనిస్టిట్యూట్‌(ICSI) అనే సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది.  ఇలాంటి యాప్స్ దాదాపు 1325 ఉన్నాయని, ఇవన్నీ లోకేషన్ హిస్టరీతో పాటు పర్సనల్ డాటాని కలెక్ట్ చేసున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికై గూగుల్, యాపిల్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలో రాబోయే అండ్రాయిడ్ Q ఓఎస్ ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుందని టెక్ పండితులు అంటున్నారు.

Latest Updates