అధైర్యపడొద్దు.. ఆర్టీసీ కార్మికుల వెంట 4 కోట్ల ప్రజలున్నారు

అధైర్యపడొద్దు.. ఆర్టీసీ కార్మికుల వెంట 4 కోట్ల ప్రజలున్నారు

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. వారి సమస్యలను వెంటనే సీఎం కేసీఆర్ పరిష్కరిచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హయత్ నగర్ లో నిర్వహించిన RTC కార్మికుల ధూం  ధాం కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిన ఆయన… కార్మికులు ఎవరు అధైర్య పడవద్దని సూచించారు. మీ వెనుక నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారని తెలిపారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కిరాయి డ్రైవర్లను పెట్టుకొని నడిపించే బస్సులు  ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జరుగుతున్న ప్రమాదాలకు కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై…తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రులు మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు హుజుర్ నగర్ ఉప ఎన్నికలో TRS వందల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అయినా ఆ పార్టీకీ ఓటమి తప్పదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు.