కేవలం ఆ.. సమస్యలకే కాదు.. వీటితో మరెన్నో ప్రయోజనాలు

మునగాకు, కాడలు అనగానే చాలా మంది సెక్స్​ సమస్యలను మాత్రమే దూరం చేసేందుకు అనుకుంటారు. కానీ, వీటిని వాడడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చిగానే కాదు వీటిని పొడి చేసి కూడా చాలా రకాలు ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులతో తయారుచేసిన టీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. ‘మోరింగా టీ’ అని పిలిచే ఈ డ్రింక్‌తో కిడ్నీల్లో రాళ్ల సమస్య తగ్గి కొవ్వు కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇంకా మరెన్నో లాభాలు  ఉన్నాయి.

మోరింగ లో అనేక ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. నిల్వ చేసిన విసెరల్ కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది. టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా పాలీఫెనాల్స్, మొక్కల సమ్మేళనాలు. సింథియా ట్రైనర్ రాసిన ‘హౌ టు లూస్ బ్యాక్ ఫ్యాట్’ పుస్తకం ప్రకారం, “మోరింగ టీ బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. కొవ్వు నిల్వకు బదులుగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆకులలో లో ఫ్యాట్, అధిక పోషక విలువలు ఉన్నాయి. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. మోరింగా పౌడర్ ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో, కిరాణా దుకాణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీనిని ఫిల్టర్ చేసిన నీటిలో మరగబెట్టి, ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి. . అయితే, మీరు బ్రాండ్లు, ప్యాకేజ్డ్ పౌడర్‌లను నమ్మకపోతే, మీ ఇంట్లోనే సులభంగా పౌడర్‌ ను తయారు చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కొన్ని తాజా మునగ ఆకులను తెచ్చుకోండి. వాటిని చక్కగా ఎండలో ఆరబెట్టండి , ఆపై పౌడర్ లా చేసుకొని దీని టీ చేసుకోవచ్చు.

Latest Updates