అల్లర్లు జరుగుతుంటే కేజ్రీవాల్, అమిత్ షా ఏం చేస్తున్నారు?

ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ. అల్లర్లు జరుగుతుంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అల్లర్ల బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చెయ్యాలన్నారు.

అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర దాగుందని ఆమె అన్నారు. ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని విమర్శించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని ధ్వజమెత్తారు. అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తుందని చెప్పారు.

Latest Updates