జైల్లో టార్చర్‌‌‌‌ పెట్టారని ఆవేదన

కోల్‌‌కత: పశ్చిమ బెంగాల్‌‌ సీఎం మమతాబెనర్జీకి సారీ చెప్పే ప్రసక్తే లేదని బీజేపీ యూత్‌‌ వింగ్‌‌ కార్యకర్త, మమత ఫొటోను మార్ఫింగ్‌‌ చేసి అరెస్టు అయిన  ప్రియాంక శర్మ అన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అలీపొర్‌‌‌‌ జైలు నుంచి బుధవారం విడుదలైన ఆమె మీడియాతో మాట్లాడారు. “ జైల్లో నన్ను చిత్రహింసలు పెట్టారు. జైలర్‌‌‌‌ నన్ను తోసేసింది. వాళ్లు చాలా అమర్యాదగా ప్రవర్తించారు. లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంది” అని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు ఆర్డర్స్‌‌ను జైల్‌‌ అధికారులు పట్టించుకోలేదని, కోర్టు విడుదల చేయమని ఆదేశించినా మంగళవారం విడుదల చేయకుండా ఆలస్యం చేశారని ప్రియాంక అన్న రాజీవ్‌‌ శర్మ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రియాంక తరఫు లాయర్‌‌‌‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానిపై కోర్టు స్పందిస్తూ వెంటనే ప్రియాంకను విడుదల చేయాలని లేకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని బెంగాల్‌‌ ప్రభుత్వాన్ని ఆదేశించటంతో ఆమెను విడుదల చేశారు.

Latest Updates