కూలర్స్‌ అమ్మకాలు ఇంకా పెరగొచ్చు

there-is-chance-of-raising-coolers-sales
  • ఎండలు తగ్గకపోవడమే కారణం
  • భారీ అమ్మకాలు నమోదవుతాయంటున్న కంపెనీలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు పెరుగుతూనే ఉన్నందున ఈసారి వేసవిలో ఎయిర్‌‌ కూలర్స్‌‌ అమ్మకాలు మరింత పెరుగుతాయని వీటి తయారీ కంపెనీలు, అమ్మకం దారులు భావిస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి బ్రాండెడ్‌‌ కంపెనీలు ఇంటర్నెట్‌‌ ఆఫ్‌‌ థింగ్స్‌‌, టచ్‌‌ డిజిటల్‌‌ కంట్రోల్‌‌ ప్యానెల్‌‌, మల్టీస్టేజ్‌‌ ఎయిర్‌‌ ప్యూరిఫికేషన్‌‌, క్యూలింగ్‌‌ ప్యాడ్స్‌‌, ఇంటెలిజెంట్‌‌ రిమోట్‌‌ వంటి సదుపాయాలతో కూలర్లను తయారు చేస్తున్నాయి.

విండో, టవర్‌‌, డిజర్ట్‌‌ ఎయిర్‌‌ కూలర్స్‌‌ సబ్‌‌ కేటగిరీల్లో వీటిని తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయని వోల్టాస్‌‌ ఎండీ, సీఈఓ ప్రదీప్‌‌ బక్షి ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర, మధ్య రాష్ట్రాల్లో అమ్మకాలు బాగున్నాయని చెప్పారు. ఎయిర్‌‌ కూలర్స్‌‌ మార్కెట్లో ఇప్పటికీ లోకల్‌‌ కంపెనీల హవా కొనసాగుతున్నా, జీఎస్టీ వచ్చాక ధరలు తేడాలు బాగా తగ్గడంతో బ్రాండెడ్‌‌ కూలర్లకూ ఆదరణ పెరుగుతోంది. ఈ వేసవిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 30 శాతం, పట్టణ ప్రాంతాల నుంచి 70 శాతం అమ్మకాలు సాధిస్తామని బజాజ్‌‌ ఎలక్ట్రికల్స్‌‌ అధికారి శర్మ అన్నారు.

తమ కూలర్లలో స్మార్ట్‌‌ సెన్సర్‌‌ ఏర్పాటు చేయడం వల్ల స్మార్ట్‌‌ఫోన్‌‌తోనే కంట్రోల్‌‌ చేయవచ్చని చెప్పారు. గాలి, తేమలను బట్టి ఉష్ణోగ్రతలను దానికదే మార్చుకుంటుందని తెలిపారు. వోల్టాస్‌‌ కూడా 39 రకాల మోడల్స్‌‌ను తీసుకొచ్చింది. వీటిలో స్మార్ట్‌‌ హ్యుమిడిటీ కంట్రోలర్‌‌, ట్రిపుల్‌‌ ఫిల్టర్‌‌ అడ్వాంటేజ్‌‌, యాంటీ బ్యాక్టీరియల్‌‌ ట్యాంక్‌‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

Latest Updates