ఢిల్లీలోనే కాదు.. దేశంలో ఎక్కడా కరోనా స్టేజ్ 3 లేదు: హోం మంత్రి అమిత్ షా

కరోనా కేసుల్లో చైనాకు చేరువలో ఢిల్లీ
దేశ రాజధానిలో 80,188 మందికి వైరస్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశ(స్టేజ్ 3)కు చేరలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ల్లీలో ప్రస్తుత పరిస్థితిపై హోంమంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై నీతి ఆయోగ్ కు చెందిన డాక్టర్ పాల్, ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియాతో తాను చర్చించానని, భయపడాల్సిన అవసరమేమీ లేదన్నారు. ఢిల్లీలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరుగుతోందని, దీనిని కేంద్ర ప్రభుత్వమే కన్ఫమ్ చేయాలని ఇటీవల హెల్త్ మినిస్టర్ సత్యేం దర్ జైన్ కామెంట్ చేసిన నేపథ్యంలో అమిత్ షా ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కరోనా వైరస్ బారిన పడి, ట్రీట్ మెంట్ తర్వాత కోలుకున్న జైన్.. ఢిల్లీలో 50 మంది పేషెంట్లకు వైరస్ ఎవరి నుంచి అంటుకుం దో తెలియడంలేదన్నారు. అయితే, ఢిల్లీలోనే కాదు, దేశంలో ఎక్కడా కరోనా స్టేజ్ 3కి చేరలేదని కేంద్రం వెల్లడించింది. దేశంలో మహారాష్ ట్ర తర్వాత అత్యధిక కేసులు ఢిల్లీ లోనే నమోదయ్యాయి. ఆదివారం నాటికి ఢిల్లీలో కరోనా కేసులు 80,188కి చేరాయి. మరణాల సంఖ్య 2,558కి చేరింది. దీంతో కరోనా కేసుల విషయంలో ఈ వైరస్ పుట్టిన చైనాకు ఢిల్లీ చేరువైంది. చైనాలో 83,500 కేసులు నమోదు కాగా , 4,634 మంది చనిపోయారు. పాకిస్తాన్, చైనాకు నచ్చేలా రాహుల్ కామెంట్స్ మన దేశం, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్ దేశానికి నష్టం చేసేలా ఉన్నాయని షా ఫైర్ అయ్యారు. పాకిస్తాన్, చైనాలను మెప్పించేలా ఆయన ప్రధాని మోడీని విమర్శిస్తున్నారని మండిపడ్డరు. ఇటీవల రాహుల్ “నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ” అని చేసిన ట్వీట్ కు సంబంధించి హ్యాష్ ట్యాగ్ ను చైనా, పాకిస్తాన్ లే ట్రెండింగ్ లో ఉండేలా చేశాయని చెప్పారు. “ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని మేం తిప్పి కొట్టగలం. కానీ అతి పెద్ద పొలిటికల్ పార్టీకి మాజీ ప్రెసిడెంట్అయి ఉండి మీరే ఇలాంటి రాజకీయాలు చేసినప్పుడు బాధాకరంగా ఉంటుంది” అని మండిపడ్డారు.

Latest Updates