నిరుద్యోగ తెలంగాణ..ఆరేళ్లుగా కొలువుల్లేవు..

  • ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతున్నరు.. పత్తా లేని నిరుద్యోగ భృతి
  • లక్ష ఉద్యోగాల ఊసే లేదు.. నోటిఫికేషన్ల జాడ లేదు
  • కాంట్రాక్టో ళ్లను పర్మనెంట్ చేస్తమని చెప్పి ఇప్పుడు తీసేస్తున్నరు
  • మూడు నెలల్లో దాదాపు 12 వేల మందిని రోడ్డున పడేశారు

‘తెలంగాణ వస్తే..మన ఉద్యోగాలు మనకు వస్తయ్.. మన బతుకులు బాగుపడ్తయ్’ అని ఉద్యమ టైంలో చెప్పిన నాయకులు గద్దెనెక్కి ఆరేండ్లవుతున్నా.. కొలువుల ముచ్చట్నే లేదు. ఉన్న కొలువులనే ఊడగొడుతున్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పిన సర్కారు.. ఆ ఊసే ఎత్తడం లేదు. గ్రూప్ వన్ పత్తా లేదు. డీఎస్సీని టీఆర్టీగా మార్చి పక్కనపడేసింది. ఇతర ఏ జాబ్స్కు నోటిఫికేషన్లు లేవు. నిరుడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి పేరు చెప్పి ఊరించిన పాలకులు.. మళ్లీ అధికారంలోకి వచ్చాక దాన్ని కూడా అటకెక్కించేశారు.

కరోనా టైమ్ చూసి వివిధ డిపార్ట్మెంట్ల లోని టెంపరరీ పోస్టులను ప్రభుత్వం వరుస బెట్టి ఊడగొడుతోంది. గడిచిన మూడు నెలల్లోనే 12 వేల మందికి పైగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలిగించింది. టెంపరరీ ఎంప్లాయీస్ను పర్మినెంట్ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారి ఉద్యోగాలకే ఎసరు పెడుతోంది. కొన్ని డిపార్ట్మెంట్లలో ఎంప్లాయీస్కు పొమ్మన లేక పొగ పెడుతోంది. డబ్బుల్లేవని మూడు నెలలుగా వారికి జీతాలు ఇవ్వడం లేదు.

అడపాదడపా జారీచేసిన

చిన్న చిన్న నోటిఫికేషన్ల భర్తీలోనూ అంతులేని నిర్లక్ష్యమే. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఏడాది వరకు పోస్టింగ్ ఇవ్వకుండా గ్రూప్ 2 క్యాండిడేట్లను ప్రభుత్వం తిప్పుకుంది. రెండేండ్ల కిందట సెలెక్టయిన పోలీస్ కానిస్టేబుళ్లను ఇప్పటికీ ట్రైనింగ్కు పిలువడం లేదు. దీంతో బతుకు గడవటం కష్టమై.. వాళ్లలో కొందరు కూలీ పనులకు వెళ్తున్నారు. సొంత రాష్ట్రమొస్తే ఇంటింటికో ఉద్యోగం వస్తుందని సంబురపడ్డ నిరుద్యోగులు ఉపాధి లేక ఆగమైతున్నారు. బంగారు తెలంగాణ చేసుడు ముచ్చటేందో కానీ.. ముందు కొలువులు భర్తీచేయాలని నిరుద్యోగులు డిమాండ్చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ తెలంగాణ ఏందో గానీ.. తమ కొలువులు ఊడగొట్టకుంటే చాలని ఉద్యోగులు కోరుతున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న వాళ్ళకు ఏటా నిరాశే ఎదురుతోంది. ఆరేండ్ల నుంచి ఒక్క పెద్ద నోటిఫికేషన్ కూడా లేదు. ఏదో అప్పు డప్పుడు వేస్తున్న చిన్న చిన్న నోటిఫికేషన్లు కూడా ఏండ్ల కేండ్లు భర్తీకి నోచు కోవడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులున్నారు. ప్రతి సంవత్సరం వీరి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గవర్నమెంట్ డిపార్ట్ మెంట్లలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదు. ఏదో మొక్కుబడిగా ఒక్కసారి.. అది కూడా.. 8,792 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వేసిన సర్కారు.. కనీసం టీచర్ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) అయినా నిర్వహించడం లేదు. మరోవైపు వివిధ డిపార్ట్ మెంట్లలో ఉన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఇంటికి పంపించేస్తోంది. కొందరికి ‘నో వర్క్నో పే’ అంటూ సతాయిస్తోంది.

గ్రూప్-1 ఏమైంది.?

తెలంగా ణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్ లో 128 గ్రూప్ –1 ఖాళీల భర్తీ పనిని టీఎస్పీఎస్సీకి అప్పగించినా..సర్కారు నిరక్ష్ల ్యం కారణంగా ముందడుగుపడలేదు. కొత్త జోన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినా.. ఏ పోస్టు ఏ జోన్ పరిధిలోకి వస్తుందన్నది తేల్చలేద టీఎస్‌పీఎస్సీ ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గ్రూప్ –1 నోటిఫికేషన్ వస్తుందన్నఆశతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఐదారేండ్లుగా కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక గ్రూప్ – 2 నోటిఫికేషన్ఒక్కసారి వేసి.. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఏడాది వరకు పోస్టింగ్ ఇవ్వకుండా క్యాండి డేట్లను ప్రభుత్వం తిప్పుకుంది.

పర్మినెంట్ అంటే తొలిగించుడేనా..?

తెలంగాణ వస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని కాంట్రాక్, ట్ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆశపడ్డారు. ఆంధ్రా పాలకులు సృష్టించిన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలనేవి ఉండవని, వారిని రెగ్యులరైజ్ చేస్తామని ఆరేండ్లకింద ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో హామీ ఇవ్వడంతో వారి ఆశలు చిగురించాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఉద్యోగాలు పర్మినెంట్ చేయకపోగా వివిధ శాఖల్లో కాంట్రాక్, ట్ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నవారిని ప్రభుత్వం ఒక్కో సెక్షన్ వారీగా ఇంటి బాట పట్టిస్తోం ది. లాక్ డౌన్తో ఏర్పడిన ఆర్థిక లోటును సాకుగా చూపి మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. గత మూడు నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, మిషన్ భగీరథ, హార్టికల్చర్ డిపార్ట్మర్ట్ మెంట్లలో సుమారు తొమ్మిది వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసంక్షేమ శాఖల్లో ని విద్యాసంస్థల్లో పని చేస్తున్న మరో 11 వేల మందికి నో వర్క్.. నో పే విధానాన్ని అమలు చేస్తోంది. వీరికి మళ్లీ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రైవేట్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు..

కరోనా ఎఫెక్తో ట్ ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తో ఇండస్ట్రీయల్ ఏరియాలోని కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, విద్యాసంస్థలు మూతపపడడంతో చాలా మంది చిరుద్యోగులు రోడ్డునపడ్డారు. వీటిలో కొన్ని మళ్లీ తెరుచుకున్నప్పటికీ గిరాకీ లేక.. వేతనాల భారం మోయలేక సిబ్బం దిని సగానికి తగ్గించారు. మరోవైపు అమెరికాలాంటి దేశాల ప్రాజెక్టులపై ఆధారపడి పని చేసే హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలు, బీపీఓలకు కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో తమ సిబ్బందిని భారీ తగించారు. మన రాష్ట్రంలోనే సుమారు లక్ష మంది ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపినట్లు తెలిసింది.

నిరుద్యోగ భృతి ఎటుపాయె?

2018 ఎన్నికల హామీల్లోభాగమైన ‘నిరుద్యోగ భృతి’ అమలు చేస్తామన్న రాష్ట్రప్రభుత్వం.. ఆ మాటనే మరిచిపోయింది. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులే సుమారు 29 లక్షల మంది ఉన్నారు. వీరిలో అర్హులైన వారందరికీ ప్రతి నెలా రూ. 3,016 ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్అకౌంట్ బడ్జెట్ డ్జె లో ఈ స్కీమ్కు రూ. 1,810 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. తర్వాత ప్రవేశపెట్టిన రెగ్యులర్ బడ్జెట్డ్ లో అసలు నిధులే కేటాయించలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఊడి యువత రోడ్డున పడ్డటైమ్లో భృతి ఇచ్చి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టిం చుకోవడమే లేదు.

ఖాళీగా లక్ష ఉద్యోగాలు

రాష్ట్రంలోని వివిధ డిపార్ట్ మెంట్లలో 1,51,116 ఖాళీలు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 58,240 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. అంటే సుమారు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి తోడు ప్రతి నెలా 500 నుంచి 700 మంది ఉద్యోగులు రిటైరవుతున్నారు. దీంతో ఈ పోస్టులు ఖాళీల్లోనే చేరిపోతున్నాయి . రాష్ట్రంలో ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ ద్వారా 29,091 ఉద్యోగాలు,పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుద్వారా 11,291 పోస్టులను భర్తీ చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్లో 1,514 మందిని, పంచాయతీ కార్యదర్శులుగా 9,355 మందిని నియమించారు. గురుకులాల్లో5,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సెక్రటేరియట్లో మొత్తం 3,500 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. ఇప్పటికే దాదాపు 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖర్చుపెరుగుతుందనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్ ప్రాసెస్కు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదనే విమర్శలున్నాయి.

టీఆర్టీ ఊసు లేదు.. టెట్ ముచ్చట లేదు

తెలంగాణ ఏర్పాటు తర్వాత డీఎస్సీని ప్రభుత్వం టీచర్ రిక్రూట్ మెంట్(టీఆర్టీ)గా మార్చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్ పీఎస్సీ ద్వారా ఒక్కసారే టీచర్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,792 టీచర్ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇవ్వగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో జాప్యం జరిగింది. అనేక ఆందోళనల అనంతరం పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. గత ఆరేండ్ల లో వేలాది మంది టీచర్లు రిటైర్డ్ అయినప్పటికీ మళ్లీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరో వైపు టీచర్ పోస్టుకు కనీస అర్హత అయినటువంటి టెట్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలో కేవలం రెండుసార్లే (2016 మే 22న, 2017 జులై 23న) నిర్వహించారు. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేండ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. ఆ గడువు దాటితే మళ్లీ టెట్‌ పరీక్ష రాయాలి. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాల్సి ఉన్నా రాష్ట్ర విద్యా శాఖ మాత్రం తాము ఏడాదికి ఒక్కసారే నిర్వహించేలా 2015లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమైనా 2018, 2019, 2020లో మూడు సార్లు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇప్పటికే గడువు తీరిన ఐదు లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగూ టీఆర్టీ పెట్టే ఉద్దేశం లేకనే ప్రభుత్వం టెట్ ను నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు టెట్ అర్హత లేకపోవడంతో ఇతర ప్రైవేటు స్కూళ్లలో, నేషనల్ రిక్రూట్మెంట్ టెస్టుల్లో నిరుద్యోగులకు అవకాశం లేకుండాపోతోంది.

సమ్మె చేస్తే ఉన్న పోస్టులు ఊడగొట్టింది

తమ సమస్యలను మొర పెట్టు కునేందుకు సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఏకంగా
ఉద్యోగాల నుంచి వెళ్ల గొట్టిందీ రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ ఉపాధి హామీ పథకంలో
రాష్ట్రంలో 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లున్నారు. వీరంతా తమ డిమాండ్ల సాధనకు
మార్చిలో సమ్మె చేపట్టగా.. ప్రభుత్వం లెక్కచేయలేదు. ఏకంగా వీరందరినీ డ్యూటీల
నుంచి తొలిగించి రోడ్డున పడేసింది. ఇంటింటికి నల్లా నీరు అందించే మిషన్ భగీరథ స్కీమ్లో పనిచేసిన ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లకు పదకొండు నెలలు జీతాలు ఇవ్వకుండా సతాయించిన ప్రభుత్వం ఇటీవల ఏకంగా ఇంటికి సాగనంపింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేసే సుమారు 500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలిగించింది. నిధుల్లేవని కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా మూడు నెలల జీతాలను ఎగ్గొట్టింది. నష్టాల పేరిట ఆర్టీసీలోనేసుమారు 300 మంది హోంగార్డులను డ్యూటీ నుంచి తొలిగించింది.

ఏపీలో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు కార్పొరేషన్

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ల వారీగా వేటు వేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో వారి కోసం ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌)ను ఆ రాష్ట్ర సీఎం జగన్ ఈ నెల 3న ప్రారంభించడం విశేషం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలోగానీ, జీతభత్యాల్లోగానీ ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఇవ్వరాదనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజే వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 50,449 మందికి అపాయింట్మెట్ ఆర్డర్స్ను ఆన్ లైన్ లో సీఎం జగన్ అందజేశారు. వీరికి జీతం, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన భరోసా ఇచ్చారు. మన దగ్గర ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి.

Latest Updates