బర్డ్‌ఫ్లూతో మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదు

బర్డ్‌ఫ్లూ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన పని లేదని…దీంతో ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. తప్పుడు ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితులపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో అందరికంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశామని మంత్రి తలసాని చెప్పారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఏమాత్రం ఏదని, చికెన్, కోడిగుడ్డు తింటే బర్డ్‌ఫ్లూ రాదన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, అనవసర భయాందోళనలు వద్దని సూచించారు మంత్రి తలసాని.

Latest Updates