ఈ వైరల్ ఫొటోలో దాగున్న పిల్లిని కనుక్కోండి చూద్దాం? 

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌‌లో వైరల్ అవుతున్న ఒక జంతువుకు సంబంధించిన ఫొటో పజిల్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సదరు ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తించడానికి యూజర్లు తలలు పట్టుకుంటున్నారు. దాక్కోవడంలో పిల్లి చాలా ఎక్స్‌‌పర్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ ఫొటో ద్వారా ఆ విషయం మరోమారు నిరూపితమైంది. ఏడబ్ల్యూడబ్ల్యూ సబ్‌‌రెడిట్‌‌లో సదరు ఫొటోను పోస్ట్ చేశారు. పిల్లిని కనుక్కోవాల్సిందిగా చాలెంజ్‌‌ చేస్తూ క్యాప్షన్ జత చేశారు. లివింగ్ రూమ్‌‌లో చెయిర్, బుక్‌ షెల్ఫ్ ఉన్న సదరు ఫొటోలో ఎక్కడో ఒక చోట పిల్లి దాగుంది. దాన్ని కనుక్కునేందుకు నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. వారందరి కంటే మీరు మెరుగైనా వాళ్లా? అయితే ఆలస్యమెందుకు ఈ ఫొటో చూడండి. అందులోని మార్జాలాన్ని వెతికి పట్టేయండి మరి. క్యూట్ క్యాట్ కదా ఆచూకీ దొర్కపోదు లెండి.

పిల్లిని కనిపెట్టలేకపోయారా? ఉసూరుమనకండి. ఇదిగోండి ఈ పై ఫొటోను చూసేయండి. పిల్లి జాడ తెలిసిపోతుంది. క్యాట్ లవర్స్‌‌కు, పజిల్ పరిష్కరించడానికి ఇష్టపడే వాళ్లకు ఈ వెతుకులాట నచ్చే ఉంటుంది.

Latest Updates