2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ లు : మీ నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ ఇలా ఉందా

టెక్ యుగంలో పాస్ వర్డ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, మెయిల్స్ లలో మన వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండాలన్నా, బ్యాంక్ అకౌంట్ లలో సొమ్ము బద్రంగా ఉండాలన్న పాస్ వర్డ్ కీరోల్ ప్లే చేస్తుంది. అందుకే మనం క్రియేట్ చేసే పాస్ వర్డ్ చాలా కష్టంగా ఉండాలని నార్డ్ పాస్ అనే పాస్ వర్డ్ మేనేజ్మెంట్ సర్వీస్ తెలిపింది.

నార్డ్ పాస్ మేనేజ్మెంట్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం… ఆన్ లైన్ లో మన వ్యక్తిగత సమాచారం, ఆన్ బ్యాంకింగ్ లో మన డబ్బు సురక్షితంగా ఉండాలంటే క్లిష్టంగా ఉండే పాస్ వర్డ్ ను ఎంపిక చేసుకోవాలని, లేదంటే హ్యాకర్ల ఉచ్చులో పడాల్సి వస్తుందంటూ హెచ్చరించింది.

2020లో హ్యాకర్స్ ఈజీగా ఉన్న 10 రకాల పాస్ వర్డ్ ల సాయంతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేసినట్లు నార్డ్ పాస్ తెలిపింది. ఈ 10రకాల పాస్ వర్డ్ లలో మీ పాస్ వర్డ్ ఉంటే మార్చుకోవాలని తెలిపింది.

నార్డ్ పాస్ ఈజీగా ఉన్నట్లు చెప్పిన 10 రకలా పాస్ వర్డ్ లు ఇలా ఉన్నాయి. వాటిలో

123456

12346789

Picture1

Password

12345678

111111

123123

12345

1234567890

Snesha పేర్లతో పాస్ వర్డ్ లు ఉన్నాయని ఇలా కాకుండా snesha123@$ ఇలా క్రియేట్ చేసుకోవాలని, క్రియేట్ చేసిన పాస్ వర్డ్ 90రోజలకు ఒకసారి మార్చాలని నార్డ్ పాస్ సంస్థ వెల్లడించింది.

 

Latest Updates