వర్క్​ ఫ్రం హోం చేయాలంటే ఈ కండిషన్స్ తప్పనిసరి

వర్క్​ ఫ్రం​ హోమ్…. అంటే ఒకవైపు ఇంటి పని చేస్తూనే, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చడం. అందుకే వర్క్​ ఫ్రం​ హోమ్​కు చాలామంది ఇంట్రెస్ట్​ చూపుతారు. అయితే ఆఫీసుకి వెళ్లకుండా ఇంటి పనులు చూసుకుంటూ, జాబ్​ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ కష్టం కూడా. వర్క్​ ఫ్రం హోం చేయాలంటే సరైన ప్లానింగ్​, టైం మేనేజ్​మెంట్​ ఉండాలి.

ఆఫీస్​లో ఉన్నట్టు ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా, కదలకుండా కూర్చొని పని చేయడం సాధ్యమయ్యే పని కాదు. ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. అందుకు చేయాల్సినవి, చేయకూడనివి ఉంటాయి. కొన్ని కండిషన్స్​ ఉంటేనే ఇది సాధ్యం.

సోషల్​ మీడియాకు దూరం

ఆఫీస్​ వర్క్​లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా అని ఫోన్లో మాట్లాడటం, సోషల్​ మీడియా లో చాటింగ్​ లాంటివి చేయడం వల్ల తెలియకుండానే టైం వేస్ట్​ అవుతుంది. ల్యాప్​టాప్, పుస్తకాలు, ఫైళ్లు​ తమ పరిధిలోనే ఉంచుకోవాలి. ఒకవేళ పిల్లల కంటపడితే విలువైన సమాచారం మాయమవుతుంది. అందుకని విడిగా​ స్పేస్​ క్రియేట్​ చేసుకోవాలి. ఇంట్లో పని ఏదైనా ఉంటే, అది పూర్తి కాకుండా కంప్యూటర్​ ముందు కూర్చోవద్దు. అలా చేస్తే పనులు పెండింగ్​ పడతాయి. పని వేళలను నచ్చినట్టుగా సెట్​ చేసుకుంటే వర్క్​ హాయిగా చేసుకోగలుగుతారు. పనితో పాటు నచ్చిన హాబీస్​కు టైం ఇవ్వాలి. వీలుంటే ఫ్యామిలీ మెంబర్స్​తో గడపాలి.

కచ్చితమైన టైంలో

డెడ్​లైన్​ దగ్గర పడుతున్నప్పుడు ఇంటి పనులపై ఫోకస్​ తగ్గించాలి. ఆడవాళ్లు అయితే పిల్లలను చూసుకునే బాధ్యతను ఫ్యామిలీ మెంబర్స్, లేదా ఫ్రెండ్స్​కు అప్పగించాలి. పిల్లలు నిద్ర పోయినప్పుడు, స్కూల్​కి వెళ్లినప్పుడు ఆ టైం కచ్చితంగా ఉపయోగించుకోవాలి. సిస్టమ్​ ముందు కూర్చున్నప్పుడు, అప్పుడప్పుడు రెస్ట్​ తీసుకోవాలి. అటూఇటూ నడవడం, కొద్దిగా బయటికి వెళ్లి రావడం చేయాలి.

సెపరేట్​ స్పేస్​

మర్నాడు చేయాల్సిన పనిని ముందు రోజు రాత్రే ప్లాన్​ చేసుకోవాలి. పర్సనల్​ లైఫ్​ నుంచి ఇంటి పని వరకు, అన్నింటికీ ప్లానింగ్​ ఉండాలి. దేనికి ఎంత టైం ఇవ్వాలో రాసి పెట్టుకోవాలి. అలా అన్నీ ప్లాన్​ ప్రకారం చేస్తేనే అనుకున్నది సాధిస్తారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లు కొంతమంది అన్ని పనులు తామే చేయాలనుకుంటారు. పక్కవాళ్ల సాయం తీసుకోవాలనుకోరు. అది తప్పు. ఒంట్లో అలసటగా ఉన్నప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు పిల్లలకు తినిపించడం, స్కూల్​కి రెడీ చేయడం, వంట చేయడం వంటి పనుల్లో కుటుంబ సభ్యుల సాయం తీసుకోవాలి. పని వేళలను ప్లాన్​ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే పని మొదలుపెట్టాలి. అంటే ఎర్లీ మార్నింగ్ లేదా నైట్​ టైంలో ప్లాన్​ చేసుకుంటే వర్క్​కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని పనులు ఒకేసారి చేస్తున్నప్పుడు ఒక్కోసారి విజయం రాకపోవచ్చు. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. అలాంటప్పుడు కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించాలి.

వర్క్​ షెడ్యూల్​

డెడ్​లైన్​ దగ్గర పడుతున్న కొద్దీ తెలియకుండానే ఒత్తిడి పడుతుంది. దాన్ని కచ్చితంగా అధిగమించేందుకు ప్రయత్నించాలి. వర్క్​ షెడ్యూల్​ని సరిగా ప్లాన్​ చేసుకోలేక ఇబ్బంది పడతారు. ఇంకొందరు పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల్లో చొరవ తీసుకోవడం, టైం వేస్ట్​ చేయడం లాంటివి చేస్తుంటారు. అలాకాకుండా కాన్ఫిడెంట్​గా పని చేస్తే, వచ్చే డెడ్​లైన్​ టెన్షన్​ ఉండదు. బలాలు పెంచుకుంటూ, బలహీనతలను కూడా తగ్గించుకుంటూ పోవాలి. అప్పుడే అనుకున్నది సాధించగలరు.

వీటిలో అవకాశాలు ఎక్కువ

  • డాన్స్​​, మ్యూజిక్ స్కిల్​ నేర్పించడం
  • ఫ్రీలాన్స్​ రైటింగ్​, ఎడిటింగ్​
  • ఆన్​లైన్​ ట్యూటర్​​ (ఎడ్యుకేషన్, ఫిట్​నెస్)
  • క్యాటరింగ్​, బేకింగ్​, సాఫ్ట్​ స్కిల్స్​లో ట్రైనింగ్​.

ఆఫీస్​లో కన్నా ఇంటి దగ్గర పనిచేయడానికి చాలామంది ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. ట్రాఫిక్‌‌ ఇబ్బందులు తప్పించుకోవచ్చని, టైం సేవ్​ అవుతుందని, జర్నీ ఖర్చులు కలిసొస్తాయని చాలామంది ఉద్యోగుల మాట. ఇంటి నుంచి పనిచేయడం వల్ల కంపెనీ ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఆఫీసులకు వెళ్లి ఒత్తిడితో ఇబ్బంది పడటం కన్నా ఇంట్లో పనిచేసుకోవడం మేలని యూత్​ అంటున్నారు.

these-conditions-are-must-for-employees-who-are-work-from-home

Latest Updates