ఈ అల‌వాట్ల‌తో మీ మెద‌డు డ్యామేజ్ అవుద్ది

These Habbits can Damage your Brain.

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. మిగతా అవయవాలుఎంత ఆరోగ్యం గా ఉన్నా.. ఇది పనిచేయకపోతే ఇబ్బందే. అలాంటి మెదడు ఆరోగ్యం గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో.. అది డ్యామేజ్కాకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం. అయితే, ముఖ్యం గామెదడును డ్యామేజ్ చేసే అలవాట్లు మనిషిలో చాలా ఉన్నాయి. అవేంటంటే..

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం
ఉదయం టిఫిన్ తినడం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. బ్రేక్ ఫాస్ట్ స్కిప్చేయడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ తగ్గి మెదడు మొద్దుబారుతుంది.దీంతో పాటు బీపీ పెరగడం, అధికబరువు, రక్తంలో అనారోగ్య కొవ్ వులుచేరడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో అన్ని భాగాల కంటే ఎక్కువ ఎనర్జీని తీసుకునేది మెదడే. కాబట్టి,సమయానికి ఆహారం తింటూ.. ఎప్పటికప్పుడు ఎనర్జీ అందించాలి.

ఆరోగ్యంపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం.
శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉంటే, మానసికంగా కూడాఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏదైనా వ్యాధులు, జబ్బులు,ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. అదిమెదడుపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.మధుమేహం, ఊబకాయం సమస్యలు ఉన్నవాళ్లకి శరీరంలోగ్లూ కోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని,దానివల్ల మెదడు పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందని శాస్త్రవేత్తలుచెబుతున్నా రు. ఇక స్మోకింగ్ , ఆల్కహాల్ లాంటి అలవాట్లకారణంగా.. శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడంతో పాటుశరీరంలోకి హానికర రసాయనాలు చేరతాయి.ఫలితంగా మెదడు పనితీరు దెబ్బతిం టుంది. కాబట్టిధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

అతిగా చ‌క్కెర‌, ఉప్పు
శరీరానికి , మెదడుకు చక్కె ర అవసరమే. అయితే, అతిగా చక్కె రతీసుకోవడం వల్ల మెదడులోని కణాలు దెబ్బతినే ప్రమాదంఉంది. అలాగే శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలనుఆహారం నుంచి గ్రహించడం కూడా కష్టమవుతుంది. దీంతోజ్ఞా పకశక్తి మందగిస్తుంది. కాబట్టి చక్కె ర ని అవసరానికి తగినంతతీసుకోవాలి. చక్కె రతో పాటు ఉప్పు కూడా పరిధి దాటితే బ్లడ్ప్రెజర్ పెరిగి మెదడుపై ప్రభావం పడుతుంది.

ఒత్తిడి,ఒంట‌రిత‌నం

దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.దీనివల్ల మెదడులో ఒత్తిడిని ఎదుర్కొనే హార్మోన్ ఎక్కువై..సమస్యగా మారుతుంది. అంతేకాకుండా మెదడులోని కణాలుచితికిపోవడం, మెదడు కుచించిపోవడం జరుగుతుంది.మెదడులో ఉత్పత్తయ్యే రసాయనాల్లో మార్పులకు ఒంటరితనం కారణమవుతోందని తాజాగా ఒక అధ్యయం తెలిపింది. దీనివల్లభయం, దూకుడు పెరుగుతుందని తెలిసిం ది. ప్రస్తు త జీవనశైలివల్ల నలుగురితో కలవడం తగ్గిపోవడంతో కుంగుబాటు, ఒత్తిడిపెరిగి తీవ్ర అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందట.
నిద్రలేమి
మెదడు పనితీరును నిద్ర కొరత దెబ్బతీస్తుంది. కంటి నిం డా నిద్ర పోవటం వల్ల జ్ఞా పకాలు స్థిరపడతాయి. ఏకాగ్రత ఉంటుంది. నిర్ణయాల్లో తడబాటు ఉండదు.మెదడు చురుకుగా పని చేస్తుంది. అర్ధరాత్రి వరకు మేలుకుని ఉండటం వల్లమెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే నిద్రపోయేటప్పుడు తల నిం డాదుప్పటి కప్పేసు కోవడం కూడా అంత మంచిది కాదు. దీనివల్ల మెదడుకుఅందాల్సిన ఆక్సిజన్ స్థాయి తగ్గి, కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది.ఇది మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి రోజుతగినంత నిద్రపోవాలి.

డీహైడ్రేష‌న్

శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగాపనిచేయాలంటే నీళ్లు చాలా అవసరం. ముఖ్యంగామెదడుకు అవసరమైన ఆక్సిజన్ కూడా నీటి ద్వారానేచేరుతుంది. రెండు గంటల పాటు నీళ్లు తాగకుండావ్యాయామం చేస్తే డీ హైడ్రేషన్ కు గురవుతారని,దానివల్ల శరీరం అదుపు తప్పుతుందని చాలాసర్వేలు వెల్లడించాయి. నీళ్లు తాగకపోతే మెదడులోసమన్వయ లోపం తలెత్తు తుంది. ‘దాహం’ అనేదిమెదడు అందించే సిగ్నల్ . కాబట్టి దాహం వేసినప్పుడేకాకుండా మధ్యమధ్యలో కూడా నీళ్లు తాగాలి.

యూరిన్‌ను ఆపుకోవ‌డం.
యూరిన్ కు వెళ్లడాన్ని కొంతమంది వాయిదా వేస్తుంటారు.అలా చేయడం వల్ల మెదడు నరాలు ప్రభావితం అవుతాయనితాజా అధ్యయనాల్లో తేలింది. అందుకే మూత్ర విసర్జనచేయాలనిపించిన వెంటనే వెళ్లడం మంచిది. ఇవేకాకుండా ఎక్కువగా మాట్లాడటం, ఆలోచనా శక్తి తగ్గడం,వ్యాయామాలు చేయకపోవడం, ఆరోగ్యం సరిగా లేనప్పుడుబ్రెయిన్ పై ఒత్తిడి పెంచడం, పొల్యూషన్ కూడా మెదడుడ్యామేజ్ కు కారణమవుతాయి.

కావాల్సినంతే తినాలి
తక్కువగా తినడం ఎంత అనర్థమో, ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి అంతేప్రమాదం. బరువు, వయసును బట్టి ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఆహారంలోఅవసరమైనంత వరకు శరీరం క్యాలరీలుగా మార్చుకుంటుంది. మిగిలి నదంతాఅనవసరపు కొవ్ వుగా ఉండిపోతుంది. ఇది హార్ట్ ఎటాక్, మెదడు సమస్యలకుదారి తీస్తుంది. అలాగే చాలామంది టీవీ చూస్తూ లేదంటే కంప్యూటర్,సెల్ ఫోన్లలో సినిమాలు చూస్తూ తింటారు. అలా చేయడం కూడా మెదడుకు మంచిది కాదంటున్నా రు నిపుణులు.

Latest Updates