తెలంగాణ నుంచి రాజ్యసభకు వారిద్దరేనా?

కేకే, పొంగులేటికే ఎక్కువ చాన్స్?
దేశపతి శ్రీనివాస్, సురేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్
నేడు అభ్యర్థు లను ప్రకటించే అవకాశం
సీఎం నుంచి ఫోన్లు వెళ్లినట్టు చెప్తున్న పార్టీ నేతలు
తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకున్న కేకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నిక జరుగనున్న రెండు రాజ్యసభ సీట్లను ఎవరికి ఇచ్చేదీ సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించే చాన్స్ ఉంది. నామినేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎంపిక చేసిన అభ్యర్థులకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారని.. నామినేషన్ వేసేందుకు కావాల్సిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. రెండు రాజ్యసభ స్థానాలకు సిట్టింగ్ ఎంపీ కె.కేశవరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం వీరిద్దరి పేర్లను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్‌‌ను, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేర్లను ఎంపిక చేసినట్టు సమాచారం. రాజ్యసభకు తనకు టికెట్ కన్‌ఫర్మ్​ అయినట్టు సంకేతాలు అందటంతో కేకే మంగళవారం తిరుమలకు వెళ్లి వచ్చారని పార్టీ నేతలు తెలిపారు.

For More News..

ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

Latest Updates