నాకు తెల్వకుండానే..నా పేరుమీద లోన్లు ఇచ్చిన్రు

లోన్ లు ఇచ్చినట్లు ఎలాంటి మెసేజ్ లూ రాలే

సిబిల్, ఐడీఎఫ్సీ, ఫ్లిప్ కార్ట్ సంస్థలపై చర్యలు తీసుకోండి

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లాయర్

నాంపల్లి (హైదరాబాద్), వెలుగు:  ఫ్లిప్ కార్ట్, ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలు తనకు తెలియకుండానే తన పేరు మీద లోన్లు ఇచ్చాయంటూ ఓ లాయర్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. సిబిల్ డేటాలో తన పర్సనల్ డేటాను సేకరించిన ఆ సంస్థలు మోసానికి పాల్పడ్డాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇటీవల సైబర్ మోసాలపై వస్తున్న వార్తలను చూసి హైదరాబాద్ తాడ్​బండ్​కు చెందిన లాయర్ మహ్మద్ బర్కత్ అలీకి తన పర్సనల్ డేటా సేఫ్ గా ఉందా? లేదా? అనే డౌట్ వచ్చింది. దీంతో ట్రాన్స్ యూనియన్ సిబిల్ లిమిటెడ్ వెబ్ సైట్లో తన వివరాలను చెక్ చేశారు. తన పేరుపై లోన్లు ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు.

రూ. 60 వేల యాక్టివ్ లోన్..  

ముత్తూట్ నుంచి తన పేరుపై లోన్ తీసుకొని, చెల్లించినట్లు సిబిల్​లో నమోదైందని అలీ చెప్పారు. మరో రూ. 60 వేల లోన్ ను ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్లు, ఆ లోన్ యాక్టివ్​గా ఉన్నట్లు కనిపించిందన్నారు. ఐడీఎఫ్​సీతో టైఅప్ అయి ఉన్న ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ సంస్థకు తన పేరుపై లోన్ మంజూరు అయినట్లుండటాన్ని గుర్తించానని తెలిపారు. తన డాక్యుమెంట్స్, అడ్రస్ ఆధారంగా లోన్ లు మంజూరు అయినట్లు ఉన్నా.. తన అకౌంట్ లో డబ్బులు పడలేదన్నారు. లోన్ లకు సంబంధించి తనకు ఎలాంటి మెసేజ్​లు కూడా రాలేదని తెలిపారు. దీనిపై ఐడీఎఫ్సీ, సిబిల్ మేనేజ్మెంట్లకు ఆయన ట్విట్టర్ ద్వారా కంప్లయింట్ చేసినా, సరైన సమాధానం రాలేదన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పర్సనల్ డేటాను స్టోర్ చేసే సిబిల్ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి మోసాలు జరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిబిల్ వ్యవహారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్‌‌‌‌‌‌‌‌.. గిఫ్ట్‌లు తెచ్చామంటూ మోసాలు

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్


Latest Updates