భారత్ బంద్ పెట్టి తాలిబన్లను ఫాలో అవుతున్నారు

భారత్ బంద్ పెట్టి తాలిబన్లను ఫాలో అవుతున్నారు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలను కొనసాగిస్తున్నారు. ఈ చట్టాలను ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా భారత బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు కాంగ్రెస్ తోపాటు బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ, తెలుగు దేశం పార్టీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ విషయంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) చీఫ్ భాను ప్రతాప్ సింగ్ స్పందించారు. బంద్ పెట్టడం సరికాదన్న భాను ప్రతాప్.. ఇలా చేయడం ద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. బంద్ కు పిలుపును ఇచ్చిన రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ మీద ఆయన మండిపడ్డారు. 

'రాకేశ్ తికాయత్ తనను తాను కిసాన్ నేత అనుకుంటారు. భారత్ బంద్ కు పిలుపును ఇస్తారు. ఈ బంద్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, రైతుల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల ఎవరికీ, ఎలాంటి ప్రయోజనం కలుగదు. భారత్ బంద్ కు ఎవరూ మద్దతు తెలపొద్దు. దీన్ని అందరూ వ్యతిరేకించాలి. రిపబ్లిక్ డే నుంచి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇలాంటి సంఘాలను బ్యాన్ చేయాలి' అని భాను ప్రతాప్ డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యల ద్వారా సదరు రైతు సంఘాల నేతలు తాలిబన్ల అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు.

For More News..

అలా చేయకపోతే గల్వాన్, డోక్లాంలో భారత్ ఓడిపోయేది

చెన్నైని ఓడించడానికి అదొక్కటే మార్గం

మ్యాన్ హోల్లో పడి గల్లంతైన సాఫ్ట్ వేర్ డెడ్ బాడీ లభ్యం