నాగ్ పూర్ ప్యాసింజర్ రైల్లో దొంగల బీభత్సం

మంచిర్యాల జిల్లా:  మంచిర్యాల జిల్లాలో మందమర్రి – రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ మధ్య నాగపూర్ ప్యాసింజర్ రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ నుండి నాగపూర్ వెళ్తున్న రైలు మందమర్రి దగ్గరకు రాగానే చైన్ లాగి ఇద్దరు మహిళల మెడలో నుంచి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ విషయంపై బాధిత మహిళలు రామకృష్ణపూర్ పీఎస్ లో  ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates