సల్లంగుండు బిడ్డా.. రాష్ట్రపతికి ‘మదర్​ ఆఫ్ ట్రీస్’ తిమ్మక్క ఆశీర్వాదం

రాష్ట్రపతి భవన్.. అడుగు తీసి అడుగేయాలన్నా ప్రోటోకాల్ పాటించాల్సిందే. శనివారం మాత్రం ఓ వృద్ధురాలు రూల్స్ ను పక్కన పెట్టి ప్రథమ పౌరుడిని ఆశీర్వదించింది. వందేళ్లు నిండిన వృద్ధురాలు అమాయకంగా చేసిన పనికి దర్బార్ హాల్ మురిసింది. హాల్ లో కూర్చున్న వాళ్ల ముఖాల్లో నవ్వులు విరిశాయి. చెట్ల పెంపకమే వ్యాపకంగా మార్చుకుని, కర్నాటకలో ఎనిమిది వేలకు పైగా మొక్కలు నాటి ‘మదర్ ఆఫ్ ట్రీస్’గా పేరొంది న సాలుమరాద తిమ్మక్క(106)కు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. శనివారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ సంఘటన చోటుచేసుకుంది .

Latest Updates