బడ్జెట్ 2019 : రేట్లు తగ్గేవి ఇవే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇవాళ లోక్ సభలో బడ్జెట్ 2019 ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో అన్ని వర్గాలు, అన్ని రంగాల సంక్షేమానికి  ప్రాధాన్యత ఇచ్చామని.. కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉంటాయని ఆమె చెప్పారు. కేంద్రబడ్జెట్ లో కేటాయింపులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పలు రంగాల్లోని వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి.

కేంద్ర బడ్జెట్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ కింది రంగాల్లో వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

  • ఎలక్ట్రిక్ వాహనాల వస్తువులు – దిగుమతి చేసుకున్నవి

  • కృత్రిమ కిడ్నీ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు

  • దిగుమతి చేసుకున్న ఉన్ని ఫైబర్

  • దిగుమతి చేసుకున్న రక్షణ సంబంధిత పరికరాలు

Latest Updates