రేపు 115 లోక్ సభ స్థానాల్లో మూడో విడత పోలింగ్

All Posts

న్యూఢిల్లీ: ఏడు దశల సా ర్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తికావచ్చింది. మూడో దశలో ఎన్నికలు జరుగుతున్న లోక్ సభ స్థానాల్లో ఆదివారంతో ప్రచారపర్వానికి తెరపడింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ని 115 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్ల నిర్వహణలో ఎన్నికల సిబ్బంది తలమునకలయ్యారు. ఫస్ట్​ ఫేజ్ లో 91 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11న, సెకండ్ ఫేజ్ లో 95 చోట్ల ఏప్రిల్ 18న పోలింగ్ పూర్తయింది. మూడో ఫేజ్ లో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో మోడీ ఇలాకా గుజరాత్, రాహుల్ బరిలో ఉన్న కేరళ కూడా ఉండటం మరింత ఆసక్తిని రేపుతోంది.

పోలింగ్ జరిగే స్థానాలివే..

గుజరాత్ లోని మొత్తం 26 లోక్ సభ స్థానాలకు , కేరళలోని 20 సీట్లలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అస్సాంలోని 5 పార్లమెంట్ స్థానా లు, బీహార్(5), ఛత్తీస్ గఢ్ (7),గోవా(2), కాశ్మీ ర్ (1), కర్నాటక(14), మహారాష్ట్ర (14), ఒడిశా(6), ఉత్తరప్రదేశ్(10), వెస్ట్​బెంగాల్ (5), దాద్రానగర్ హవేలీ(1),డయ్యూడామన్ లోని 1 పార్లమెంట్ స్థానంలో మంగళవారం పోలింగ్ జరగనుంది.

 

Latest Updates