మూడో విడత పోలింగ్ : VVPAT లో పాము

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ దేశ వ్యాప్తంగా 116 స్థానాల్లో జరిగింది. 13 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగానే కేరళలోని ఓ నియోజక వర్గంలో ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ సెంటర్ కు వచ్చారు. అయితే VVPATలో పాము కన్పించడంతో భయాందోళనకు గురయ్యారు. దీంతో కొంత సమయం పోలింగ్ నిలిచిపోయింది.

కన్నూర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మయ్యిల్ కందక్కయ్ లోని పోలింగ్ బూత్ లోని VVPATలో ఒక పాము దర్శనమిచ్చింది. దీంతో.. ఎన్నికల సిబ్బంది.. ఓటర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు వీవీ ప్యాట్ లోకి పాము ఎలా వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

పాము పట్టేవాళ్లు వచ్చి వివి ప్యాట్ నుంచి పామును బయటకు తీశారు. తర్వాత పోలింగ్ కొనసాగింది. VVPATలోకి పాము ఎలా వచ్చిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates