బంగారు తెలంగాణ కేవ‌లం బీజేపీతోనే సాధ్యం

హైదరాబాద్: బంగారు తెలంగాణ కేవలం భారతీయ జనతాపార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది యువకులు, అర్జీకే కాలనీ బీసీ మోర్చా నాయకులు కొక్కుల భిక్షపతి, శ్రవణ్ లు…. బీజేపి పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై క‌మ‌ల తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి వారికి కాషాయ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలంటే కారుకు బ్రేకులు వేయాలన్నారు. అలాగే బీజేపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొంపల్లి మోహన్ రెడ్డి, మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు నాగమల్లారెడ్డిలు సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా అధ్యక్షులు శాంతిరెడ్డి, మున్సిపాలిటీ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శులు మనుపటి శ్రీనివాస్, బింగి రమేష్ గౌడ్, మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి గుజ్జుక నర్మద పరుశురాం, ఉపాధ్యక్షులు బలరాం సింగ్, యూత్ నాయకులు కర్ర శ్రీనివాస్ గౌడ్, మహిళ నేత శోభ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates