యూట్యూబ్ వ్లాగర్‌ని బడిత పూజ చేసిన మహిళలు..

ఓ యూట్యూబ్ వ్లాగర్ ను ముగ్గురు మహిళలు బడిత పూజ చేశారు. మహిళల గురించే మాట్లాడతావా..? క్షమాపణలు చెప్పాలంటూ తిరగబడ్డారు. కేరళ తంపానూర్ పోలీస్ స్టేషన్ పరిమితి పరిధిలో విజయ్ అనే వ్యక్తి  నివాసం ఉంటున్నారు. ఓ వైపు డాక్టర్ గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు  యూట్యూబ్ వ్లాగర్ గా చెలామణి అవుతున్నారు.

ఈ నేపథ్యంలో డాక్టర్ విజయ్ యూట్యూబ్ లో దేశంలో స్త్రీవాదులు, ముఖ్యంగా కేరళకు చెందిన స్త్రీవాదులు లోదుస్తుల్ని ఎందుకు ధరించరంటూ వీడియో చేశారు.అందుకు ఉదాహరణగా తన వీడియోలో, కవి బి సుగతకుమారి,  తృప్తీ దేశాయ్, బిందు అమ్మినీ, రెహనాలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

ఆ వీడియో వివాదంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న  వెటరన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి, కార్యకర్తలు డియా సనా, శ్రీలక్ష్మి అరకల్ లు విజయ్ పై ఇంక్ పోసి దాడి చేశాడు. ఆ దాడి జరిగే సమయంలో సోషల్ మీడియాలో లైవ్ పెట్టారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. అందుకే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని డాక్టర్ విజయ్ ని దేహశుద్ది చేసినట్లు తెలిపారు

Latest Updates