ఏమిరా ఈ బతుకు?!

‘పెద్ద పెద్ద చెరువుల్లో… నచ్చిన చేపల్ని పట్టుకొని తినేదాన్ని. పచ్చని  చెట్టు మీద గూడు కట్టుకొని.. పగలంతా వేటకు పోయేదాన్ని! ఛా..! నా చెరువు చుట్టూ ఇప్పుడు పట్నం పుట్టుకొచ్చింది.  ఆకులు రాలే ప్లేస్‌‌లో  ప్లాస్టిక్ బాటిల్స్‌‌ని పారేసింది. చల్లగాలిలో పొగను కలిపింది. ఈ  మురికి నీళ్లలోకి.. ముక్కు ముంచనీకి లేదు. ముద్ద ముట్టబుద్ధైతలేదు. జైలులాగే ఉంది. ఏమి రా ఈ బతుకు?’ అని కొంగ తనలో తాను బాధపడుతున్నట్టు లేదూ?  లండన్‌‌లోని ఓ బ్రిడ్జి జాలీ నుంచి పొద్దున సూర్యకిరణాలు పడటం వల్ల అక్కడున్న  కొంగ  జైల్లో కూర్చోని  ఆలోచిస్తున్నట్టు ఉందని ఈ ఫోటో తీసిన డానియల్ ట్రిమ్ అంటడు.

Latest Updates