ఈ బ్లూటూత్ రేంజ్ అర కిలోమీటర్

బ్లూ టూత్ రేంజ్ 500 మీటర్లు షావోమీకి చెందిన మోస్ట్ అవైటెడ్ ఫోన్ ‘రెడ్ మి కె30 ప్రొ’ విడుదలైంది. ఇది5జీ స్మార్ట్ ఫోన్. ఇందులోనే ‘జూమ్ఎడిషన్’ పేరుతో మరో మోడల్ కూడా వచ్చింది. స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, క్వాడ్ రేర్ కెమెరా (64+13 +5+2 ఎంపీ), 20 ఎంపీసెల్ఫీ కెమెరా, 4,700 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐపీ 53 రేటింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. పవర్ ఫుల్ బ్లూటూత్ కవరేజ్ స్పెషల్ అట్రాక్షన్. ఇది దాదాపు ఐదువందల మీటర్ల వరకు కనెక్ట్ అయి ఉంటుంది. గతంలో ఉన్న ఫోన్లతో పోలిస్తే దీని రేంజ్ డబుల్. జూమ్ఎడిషన్లో 30 ఎక్స్ వరకు జూమ్చేసుకోవచ్చు.

  • 6జీబీ/128 జీబీ,8జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వేరియెంట్స్ లో దొరుకుతుంది.
  • ధరలు సుమారురూ.32,300/36,600/39,800.

Latest Updates