ఈ సెంచరీ నాన్నకు అంకితం

కింగ్‌ స్టన్‌ : విండీస్‌ పై రెండో టెస్ట్‌‌లో చేసిన కెరీర్‌ తొలి సెంచరీ తన తండ్రికి అంకి తమిస్తున్నట్లు టీమిండియా బ్యాట్స్‌‌మన్‌ హనుమ విహారి అన్నాడు. 13 ఏళ్ల కిం దట తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సరైన మా ర్గంలోనే పయనిస్తున్నానని చెప్పాడు. లెజెండ్‌‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తర్వా త సెంచరీ సాధించిన తెలుగు క్రికెటర్‌ గా విహారి రికార్డు సృష్టించా డు. ‘నా 12వ ఏట నాన్న మరణించారు . కచ్చితంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడాలని అప్పుడే నిర్ణయించుకున్నా. తొలి సెంచరీని నా న్నకు అంకి తమివ్వా లని ఆనాడే అనుకున్నా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. సెంచరీ తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యా. నాన్న ఎక్కడున్నా నా ఘనతను చూసి గర్వపడతారు’ అని విహారి పేర్కొన్నాడు.

రెండోఎండ్‌‌లో ఇషాంత్‌ అండ లేకుంటే సెంచరీ సాధ్యమయ్యేది కాదన్నాడు. ఓ దశలో అతని అనుభవం తనకు బాగా ఉపయోగపడిందన్నాడు. ‘నా సెంచరీ ఘనతలో ఇషాంత్‌ కు కూడా క్రెడిట్‌ దక్కుతుంది. ఓ బ్యాట్స్‌‌మన్‌ లాగా ఆడాడు. విరామంలో బౌలర్ల గురించి చర్చించుకున్నాం. తొలి రోజు ఆట తర్వా త నిద్రపోలేదు. భారీ స్కోర్‌ ఎలా చేయాలన్న ఆలోచనతోనే గడిపేశా. ఇలాంటి పరిస్థితుల్లో సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 90లోకి వచ్చా కా మరింత కఠినంగా సాగింది. మొత్తానికి నా ఆట గొప్ప సంతృప్తినిచ్చింది’ అని విహారి వ్యాఖ్యానించాడు.

 

Latest Updates